हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో కీలక ఉగ్రవాది రవూఫ్ హతం

Anusha
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో కీలక ఉగ్రవాది రవూఫ్ హతం

ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది.పాకిస్థాన్‌తోపాటు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యం, ఏక కాలంలో 9 చోట్ల చేపట్టిన సైనిక దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. బహావల్పూర్‌లో ఆయన కుటుంబీకులు ఈ దాడిలో చనిపోయారు. భారత్ జరిపిన దాడిలో మసూద్ అజహర్ సోదరుడు, 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన రవూఫ్ అజహర్ కూడా హతమయ్యాడు.భారత్ దాడిలో రవూఫ్ అజహర్(Rauf Azhar)అనే ఉగ్రవాది చావు వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులతోపాటు అమెరికా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ కిరాతకుడిని హతమార్చిన భారత్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఎందుకంటే అమెరికాకు చెందిన యూదు జర్నలిస్ట్ డానియల్ పెర్ల్‌ను రవూఫ్ దారుణంగా చంపేశాడు. 2002లో పాకిస్థాన్ తరఫున వాల్ స్ట్రీట్ జర్నల్ తరఫున జర్నలిస్టుగా పని చేస్తున్న సమయంలో పెర్ల్‌ను కిడ్నాప్ చేసి, ఎంతగానో టార్చర్ చేసిన ఉగ్రవాదులు అతణ్ని తల నరికి చంపేశారు.

అమెరికన్

డానియల్ పెర్ల్‌ చనిపోయన 23 సంవత్సరాల తర్వాత అతడి మరణానికి కారణమైన రవూఫ్ అజహర్‌ను ఇండియన్ ఆర్మీ హతమార్చిందని తెలిసి అతడి కుటుంబీకులతోపాటు అమెరికా జర్నలిస్టులు, యూదులు సంతోషం వ్యక్తం చేశారు.రవూఫ్ మరణం పట్ల అమీ మెక్ అనే అమెరికన్ జర్నలిస్ట్ స్పందిస్తూ ‘‘దారుణ హత్యకు గురైన అమెరికన్ యూదు జర్నలిస్ట్ డానియెల్ పెర్ల్‌కు భారత్ న్యాయం చేసింది. పాక్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది,ఎందరో అమాయకులు ఉగ్రవాదానికి(Terrorism)బలవుతున్నారు,జిహాద్‌కు కారణమైన ఇస్లామిక్ ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేయడం ద్వారా ఏది అవసరమో చివరకు భారత్ అది చేయగలిగింది’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

ధన్యవాదాలు

అబ్దుల్ రవూఫ్ అనే వాడు కేవలం ఉగ్రవాది మాత్రమే కాదు,జైషే మహ్మద్ ఫౌండర్ మసూద్ అజహర్ తమ్ముడు, అత్యంత క్రూరమైన ఇస్లామిక్ దాడుల వెనుక మాస్టర్ మైండ్ అతడు. డానియెల్ పెర్ల్ హత్యకు అతడే కుట్ర పన్నాడు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ఉగ్రవాదం గుండెల మీద దెబ్బకొట్టింది, జైషే మహ్మద్ బలమైన ప్రదేశాలను నాశనం చేయడం ద్వారా స్పష్టమైన సందేశం పంపించింది. ఉగ్రవాదులు ముస్లిమేతరులను వధించడాన్ని సహించబోమని భారత్ గట్టిగా చెప్పింది’ అని సదరు జర్నలిస్ట్ ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రశంసలు గుప్పించారు.భారత్‌కు మేము ధన్యవాదాలు చెబుతున్నాం. ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, బలంగా నిలబడినందుకు జిహాదీలతో నేరుగా తలపడుతున్నందుకు ధన్యవాదాలు. ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల ఎలా వ్యవహరించాలో భారత్‌ను చూసి పశ్చిమ దేశాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి.ఇలాంటి రాక్షసులకు ఆశ్రయం ఇస్తున్న వారెవరైనా పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని జర్నలిస్ట్ అమీ మెక్ పోస్టు చేశారు.

Read Also: America reprimands Pakistan: పాకిస్థాన్ ను గట్టిగా మందలించిన అమెరికా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870