
హామాస్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దాదారు రెండు సంవత్సరాల యుద్ధం అనంతరం ఈనెల రెండోవారంలో రెండు దేశాల (Israel) మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించడంతో యుద్ధం ఆగిపోయింది. అంతేకాదు రెండు దేశాలు బందీలను విడుదల చేశారు. హామాస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలతో పాటు మరణించిన వారి మృతదేహాలను సైతం అప్పగించింది. ఇజ్రాయెల్ కూడా హామాస్ ఖైదీలను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతోనే ఈ యుద్ధం ఆగిపోయిందనే చెప్పాలి. అయితే ఇజ్రాయెల్ అధ్యక్షుడిపై ముస్లిం దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే గాజాలో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఇజ్రాయెల్ దాడివల్ల మరణించారు. అంతేకాదు, పాలస్తీనా ఆర్థిక వనరులను సైతం నెతన్యాహు టార్గెట్ చేసుకుని, పలు దాడులను పాల్పడ్డారు.
గాజా పూర్తిగా కోలుకోలేనంతగా నెతన్యాహు దెబ్బకొట్టారు. హమాస్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సయోధ్యకు టర్కీ కూడా తనవంతు సాయం చేసింది. రెండు దేశాలమధ్య మధ్యవర్తిత్వం నిర్వహించింది. ప్రస్తుతం టర్కీ, ఇజ్రాయెల్ దేశాలమధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఏర్పడింది.
ఇందుకు కారణం టర్కీలోని ట్రాగ్జోన్ నగరంలో శనివారం ఓ నిరసన కార్యక్రమం జరిగింది. ఒక నిర్మాణ స్థలంలోని క్రేన్ కు నెతన్యాహు దిష బొమ్మను ఉరితీశారు. దాని పక్కనే నెతన్యాహుకు మరణశిక్ష’ అనే అర్థం వచ్చేలా ఒక బ్యానర్ ను ప్రదర్శించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదివారం స్పందించింది. ఇది ‘అవమానకరమైన ప్రవర్తన’గా అభివర్ణించింది.
Read also: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబుతో క్యాబినెట్ భేటీ
టర్కిష్ విద్యావేత్త దీని నిర్వహించింది
ప్రభుత్వ సంబంధాలున్న సంస్థ మద్దతుతో ఒక టర్కిష్ విద్యావేత్త ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆరోపించింది. ఈ ఘటనపై టర్కీ (Israel) అధికారులు స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఇజ్రాయెల్ మంత్రి పేర్కొన్నారు. గాజాలో జరుగుతున్న మూనవ హక్కుల ఉ ల్లంఘనలను ప్రపంచ దృష్టికి తీసుకురావడానికే ఈ ప్రదర్శనను ప్రతీకాత్మకంగా నిర్వహించినట్లు ఆర్ట్విన్ కోరుహ్ యూనివర్సిటీలో విజువల్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కెమన్ సగ్లావ్ పేర్కొన్నారు. గాజాలో మహిళలు, పిల్లలు, అమాయక పౌరుల జీవించే హక్కును హరిస్తున్నారు. ఈ నేరంపై ప్రపంచం మౌనంగా ఉండకూడదని, అసలైన విచారణ అంతర్జాతీయ న్యాయస్థానాల్లో జరగాలి అని విదేశాంగ మంత్రి డిమాండ్ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: