ఆపరేషన్ రోరింగ్ లయన్: 100 గంటల్లో 750 లక్ష్యాలపై దాడులు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. గత 100 గంటల్లోనే ఇరాన్‌లోని 750కి పైగా కీలక సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ (Iran)నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి.
Read Also: Social Media Ban: పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు

విస్తరిస్తున్న యుద్ధ జ్వాలలు: అజర్‌బైజాన్, ఒమన్‌పై ఇరాన్ దాడులు
తమపై జరుగుతున్న దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన పొరుగు దేశాలైన అజర్‌బైజాన్ మరియు ఒమన్‌లపై కూడా దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలపై దాడులు పెరగడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. యుద్ధం తీవ్రతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పూర్తిగా మూతపడే పరిస్థితి నెలకొంది. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: