Israel Airspace: ఇరాన్‌తో నెలకొన్న భీకర యుద్ధ ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో గత కొన్ని రోజులుగా గగనతలం (Airspace) మూతబడిన సంగతి తెలిసిందే. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన గగనతలాన్ని నేటి రాత్రి నుంచి పరిమిత స్థాయిలో తెరవబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇన్ని రోజులుగా అక్కడ చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులకు మార్గం సుగమమైంది.
గగనతలంపై ఆంక్షలు సడలించడంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను స్వదేశాలకు తరలించే ప్రక్రియ వేగవంతమైంది. గల్ఫ్ దేశాల నుంచి భారతీయులతో పాటు అనేక దేశాల పౌరులు తమ దేశాలకు చేరుకుంటున్నారు.
Read Also: US Iran War: ఇరాన్ యుద్ధానికి ₹18.8 లక్షల కోట్లు.

కొనసాగుతున్న ఉద్రిక్తతలు
గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయ పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) యుద్ధం కారణంగా విమానాలు రద్దై ఇబ్బంది పడుతున్న భారతీయులను ప్రత్యేక విమానాలు, అందుబాటులో ఉన్న సర్వీసుల ద్వారా స్వదేశానికి తరలిస్తున్నారు.
గగనతలాన్ని పాక్షికంగా తెరిచినప్పటికీ, ఇరాన్, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు విమాన సమయాలను, తాజా మార్గదర్శకాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: