Bondi Beach shooting : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిగిన బోండీ బీచ్ కాల్పుల ఘటనపై ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ దాడిని “గర్వించదగ్గ విషయం”గా అభివర్ణించిన ఐసిస్, అయితే ఈ కాల్పులకు తామే బాధ్యులమని మాత్రం ప్రకటించలేదు అని రాయిటర్స్ నివేదించింది.
హనుక్కా వేడుకల సందర్భంగా బోండీ బీచ్‌లో జరిగిన ఈ కాల్పులపై తమ టెలిగ్రామ్ ఛానల్‌లో ప్రచురించిన కథనంలో ఐసిస్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడికి తామే ప్రత్యక్షంగా పాల్పడ్డామని ఐసిస్ ప్రకటించకపోవడం గమనార్హం.
అధికారుల ప్రకారం, ఈ కాల్పులు తండ్రీ–కొడుకులు కలిసి నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ దాడి ఐసిస్ భావజాలంతో ప్రేరేపించబడినట్టుగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో పాల్గొన్న వారిలో సాజిద్ అక్రమ్ (50) పోలీసులతో ఎదురుకాల్పుల్లో మరణించగా, అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Latest News: LIG Flats: హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం
కోమా నుంచి బయటపడిన తర్వాత నవీద్‌పై (Bondi Beach shooting) హత్య, ఉగ్రవాదానికి సంబంధించిన కేసులు సహా మొత్తం 59 అభియోగాలు నమోదు చేసినట్లు రాయిటర్స్ తెలిపింది. ఈ కేసు విచారణను 2026 ఏప్రిల్ వరకు వాయిదా వేసినట్లు కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఐసిస్ నెట్‌వర్క్‌లపై పోలీసులు దృష్టి సారించారు.
సాజిద్ అక్రమ్ తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని, అతడి వద్ద భారత పాస్‌పోర్ట్ ఉందని తెలంగాణ పోలీసులు తెలిపారు. అయితే అతడు 1998లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లి, గత 27 ఏళ్లుగా హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులతో చాలా పరిమిత సంబంధాలే ఉంచుకున్నాడని వెల్లడించారు.
ఈ ఘటన అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలు ప్రకటించారు. ద్వేషం, హింసను ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేయడం సులభతరం చేసేలా కొత్త చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. అవసరమైతే వీసాలను రద్దు చేయడం, శిక్షలను పెంచడం వంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :