పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసుకుంటున్నాయి. ఇరాన్(Iran) మీద అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుధ్దం ప్రవంచ యవనికపై ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి బులియన్ మార్కెట్ వరకు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ అయితే రక్తపాతాన్నే చూస్తోందని చెప్పవచ్చు. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందా అని పెట్టుబడిదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు అయితే దీనికి ఇరాన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇరాన్‌లో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే అంశం మా చేతుల్లో ఉందని ట్రంప్ చేతుల్లో లేదని తేల్చి చెప్పింది. యుద్ధం ముగింపును నిర్ణయించేది మనమే అంటూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఓ ప్రకటనలో తెలిపింది.
Iran Israel War: ఇరాన్ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా

ఇరాన్ సుప్రీం నాయకుడు మసౌద్ పెజెష్కియన్ నియామకం
పశ్చిమాసియా భవిష్యత్ పరిస్థితులు ఇప్పుడు ఇరాన్ సాయుధ దళాల చేతుల్లోనే ఉన్నాయి. అమెరికా లేదా ఇతర దేశాలు ఈ నిర్ణయాన్ని తీసుకోలేవంటూ IRGC గట్టిగా బదులిచ్చింది. ఇక ట్రంప్ గతంలో ఈ యుద్ధం త్వరలో ముగిసిపోవచ్చు అని వ్యాఖ్యానించినప్పటికీ.. ఇరాన్ సుప్రీం నాయకుడు మసౌద్ పెజెష్కియన్ నియామకం తర్వాత పరిస్థితులు మరింత సంక్లిష్టమయ్యాయి. టెహ్రాన్ తీసుకున్న నిర్ణయంతో స్థానిక, ప్రాంతీయ, అంతర్జాతీయంగా పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. ముఖ్యంగా ముడి చమురు సంక్షోభం పతాక స్థాయికి చేరేలా ఉంది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా జరుగుతుంది. అందువల్ల ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లకు షాక్ కు గురిచేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ IRGC జలమార్గాన్ని కొంతకాలం అడ్డేసి.. దాదాపు 10 నౌకలు దాడి చేయబడ్డాయని AFP నివేదిక తెలిపింది. MSC గల్ఫ్ వంటి షిప్పింగ్ దిగ్గజాలు ఎగుమతులను నిలిపివేసి, సరుకులను ఆవశ్యకంగా నిల్వ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: