Iran protests news : అల్లర్లతో అట్టుడుకుతున్న ఇరాన్ నుంచి పలువురు భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. భారత ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తమను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం కారణంగా గత ఏడాది డిసెంబర్ చివరి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. భద్రతా పరిస్థితులు క్షీణించడం, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోవడంతో భారత్‌లో ఉన్న వారి బంధువులు ఆందోళన చెందారు.
Read Also: NTR: ‘డ్రాగన్’ మూవీలో అనిల్ కపూర్
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ, టెహ్రాన్‌లోని భారత రాయబార (Iran protests news) కార్యాలయం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా వీలైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలని భారతీయులకు సూచించింది. ఆ సూచనల మేరకు పలువురు భారత్‌కు తిరిగివచ్చారు.

స్వదేశానికి చేరుకున్న ఒక భారతీయుడు మాట్లాడుతూ, “అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయం మమ్మల్ని నిరంతరం అప్రమత్తం చేశాయి. మోదీజీ ఉన్నారు కాబట్టే మేము సురక్షితంగా తిరిగివచ్చాం” అని అన్నారు. మరో వ్యక్తి మాట్లాడుతూ, “ఇంటర్నెట్ లేకపోవడంతో మూడు రోజుల పాటు కుటుంబంతో మాట్లాడలేకపోయాం. బయటకు వెళ్లడం కూడా ప్రమాదకరంగా మారింది” అని పరిస్థితిని వివరించారు.
విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఇరాన్‌లో విద్యార్థులు సహా సుమారు 9,000 మంది భారతీయులు ఉన్నారు. వారి భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: