ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాలు బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్‌పై మిసైల్(Missiles) దాడి జరిపింది ఇరాన్.అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ లోని పలు నగరాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తూ దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది.తాజాగా ఇజ్రాయెల్ కి చెందిన స్టాక్ ఎక్స్ఛేంజ్(Stock Exchange) భవనంపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. గురువారం జరిగిన వైమానిక దాడులు టెహ్రాన్, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ
ఇరాన్ నిర్వహించిన ఈ దాడి టెల్ అవీవ్, బీర్ షెవా, రామత్ గన్‌తో సహా అనేక ప్రదేశాలను నేలమట్టం చేసింది. దీని వలన విస్తృతమైన నష్టం వాటిల్లగా.. 32 మందికి పైగా గాయపడ్డారు. ఈ భీకరమైన దాడిలో బీర్ షెవాలోని సోరోకా మెడికల్ సెంటర్ కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది అని అన్నారు.
టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంపై దాడి
ఈ దాడిలో టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనం పూర్తిగా దెబ్బతింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంపై దాడి తరువాత, ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలను తాకాయి. అల్ జజీరా న్యూస్ కథనం ప్రకారం.. ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణులు టెల్ అవీవ్ కేంద్రాన్ని తాకాయి. దీని వలన స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనం నిర్మాణం తీవ్రంగా దెబ్బతింది. ఈ నష్టం ఇజ్రాయెల్ ఆర్థిక కేంద్రమైన టెల్ అవీవ్ ఆర్థిక కార్యకలాపాలకు పెద్ద ముప్పుగా పరిణమించిందని తెలిపింది. టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంపై దాడి జరిగినప్పటికీ.. దాని ప్రధాన సూచీలు ఈరోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
గాయపడిన వారికి అత్యవసర సేవలు
టెల్ అవీవ్ జిల్లాలోని రామత్ గన్ ప్రాంతంలో జరిగిన రాకెట్ దాడిలో 20 మందికి పైగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడిలో అనేక భవనాలు దెబ్బతిన్నాయని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. గాయపడిన వారికి అత్యవసర సేవలు తక్షణ చికిత్సను అందిస్తున్నాయి.ఈ పరిస్థితులు ఇలా ఉంటే..అరక్ న్యూక్లియర్ రియాక్టర్‌పై 40 ఫైటర్ విమానాలతో బాంబుల దాడి చేసింది ఇజ్రాయిల్.
Read Also: Trump: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య సరికాదన్న రష్యా