Iran Earthquake: ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్‌లో భూకంపం సంభవించింది. దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపంపై ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. గెరాష్‌కు ఉత్తర వాయువ్య దిశలో 55 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత నమోదు కావడంతో ఈ భూకంపాన్ని తేలికపాటి నుంచి మధ్యస్థాయి భూకంపంగా తెలిపారు. భూకంపం వచ్చిన ప్రాంతం ఎక్కువగా గ్రామీణ ప్రాంతం. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగు పెట్టారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.
Read Also: Elnaz Norouzi: ‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: