
ప్రపంచదేశాలు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నాయి. బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు ఆనందంతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించేందుకు పలు కార్యక్రమాలకు సిద్ధపడుతున్నారు. ఆనంద కేరింతల్లో తేలియాడేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ ఇండోనేసియాలోని(Indonesia) ఓ ద్వీపవాసులు మాత్రం విషాదంలో మునిగిపోయింది. మరో మూడురోజుల్లో కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న ఆనందానికి దూరంగా మంటలకు దగ్ధమైపోయారు.
Read also: Trump: ఎట్టకేలకు యుద్ధం ముగింపుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకారం

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇండోనేసియాలోని(Indonesia) సులవేసి ద్వీపంలోని మనాడో నగరంలో వెర్థాదమై రిటైర్మెంట్ హోమ్ లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 16మంది వృద్ధులు సజీవ దహనమయ్యారు. మరో 12 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 16మంది వృద్ధులు సజీవ దహనం కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వాధికారులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: