IndiGo compensation: ఇటీవలి రోజుల్లో వరుసగా విమానాలు రద్దు కావడం, తీవ్ర ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావితమైన ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించింది. మొత్తం పరిహారం విలువ రూ.500 కోట్లకు మించవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని ఇండిగో సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా అధికారికంగా వెల్లడించింది.
Latest News: AP Cabinet: ఉద్యోగులకు డీఏ శుభవార్త.. ₹9,500 కోట్లతో 506 మున్సిపల్ ప్రాజెక్టులకు అనుమతి
ఫ్లైట్ క్యాన్సిలేషన్లపై ఇండిగో స్పందన
విమాన ప్రయాణానికి 24 గంటల ముందు సర్వీసులు రద్దైన ప్రయాణికులు, అలాగే కొన్ని విమానాశ్రయాల్లో ఎక్కువసేపు చిక్కుకుపోయిన వారికి ఈ పరిహారం వర్తిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది. నష్టపరిహారం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రయాణికులకు సులభంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సంస్థ పేర్కొంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ మొత్తం రూ.500 కోట్లకు పైగా ఉండే అవకాశముందని తెలిపింది.
పరిహారం చెల్లించే ప్రక్రియ
ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఎక్కువగా ప్రభావితమైన విమానాలు, ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నామని, జనవరి నెలలో వారిని నేరుగా సంప్రదించి పరిహారం చెల్లించే ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే పలువురు ప్రయాణికులకు రిఫండ్‌లు అందించామని, మిగిలిన రిఫండ్‌లు కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని ఇండిగో తెలిపింది.
ఇదిలా ఉండగా, గత నాలుగు రోజులుగా సంస్థ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని ఇండిగో వెల్లడించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 2,000కిపైగా విమానాలు నడపనున్నట్టు తెలిపింది. కార్యకలాపాల్లో అంతరాయానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు విమానయాన నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలోని ‘చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌సీ’ సంస్థను నియమించినట్టు పేర్కొంది. ఈ పరిణామాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా స్పందిస్తూ, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను పిలిపించి వివరణ కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :