సీమాంతర ఉగ్రవాదంపై గట్టి చర్యలు – మీడియా సమావేశంలో కీలక ప్రకటనలు
విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రక్షణ శాఖ అధికారులతో కలిసి జరిపిన సంయుక్త మీడియా సమావేశంలో పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రదాడి టీఆర్‌ఎఫ్ (TRF – The Resistance Front) ఉగ్రవాద సంస్థ చేతి పనిగా నిర్ధారణ.
టీఆర్‌ఎఫ్ కు పాకిస్తాన్ నుంచి అండదండలు లభిస్తున్నాయని ఆరోపణ.

టీఆర్‌ఎఫ్ వెనక ఉన్న ఉగ్ర సంస్థలు
టీఆర్‌ఎఫ్ అసలు రూపం లష్కరే తొయిబా, జైషే మహ్మద్.
ఈ రెండు సంస్థలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో నిషేధితమైనవి.
టీఆర్‌ఎఫ్ అనే కొత్త పేరు ద్వారా పాత ఉగ్ర సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
ఆపరేషన్ సింధూర్ వివరాలు
పక్కా ప్లానింగ్‌తో ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన భారత సైన్యం.
అనేక ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టినట్లు వెల్లడించారు.
సైనిక అధికారుల ప్రకటనల ప్రకారం, ఇది భారత స్వరక్షణకు తీసుకున్న అవసరమైన చర్యగా పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్ అభివృద్ధిపై ఉగ్రవాదుల కన్ను
కశ్మీర్‌లో పర్యాటక అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో ఉగ్రవాద చర్యలు.
పహల్గాం దాడి ద్వారా భయభ్రాంతులకు గురిచేయాలన్న దురుద్దేశం.
కుటుంబసభ్యుల కళ్ల ముందే అమాయకులపై జరిగిన దాడి అత్యంత క్రూరంగా అభివర్ణించారు.
భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు
ఐక్యరాజ్యసమితికి టీఆర్‌ఎఫ్ గురించి ఫిర్యాదు. ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిందితులను గుర్తింపు.
సీమాంతర ఉగ్రవాదాన్ని సమూలంగా నశింపజేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి.
పాక్ ఉగ్రవాద మద్దతును అంతర్జాతీయంగా బహిర్గతం చేయడంపై దృష్టి.
Read Also: India Pakistan War: ఇండియాకు మద్ధతు తెలిపిన ఇజ్రాయెల్