Indians Arrested in UAE: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. యుద్ధానికి సంబంధించి తప్పుడు పోస్టులు పెట్టిన ఆరోపణలపై మొత్తం 35 మందిని అక్కడి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఏకంగా 19 మంది భారతీయ పౌరులు ఉండటం గమనార్హం.
Read Also: DK Shivakumar : మా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారని, డీకే సంచలన ఆరోపణలు

ఏం జరిగిందంటే?
నిందితులు ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు చేసినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఏళ్ల క్రితం జరిగిన క్షిపణి దాడుల వీడియోలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించిన నకిలీ క్లిప్‌లను ప్రస్తుత ఘటనలుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
చర్యలు కఠినతరం
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ, విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. డిజిటల్ మాధ్యమాల్లో దేశ భద్రతకు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన శిక్షలు తప్పవని యూఏఈ అధికారులు హెచ్చరిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిపై సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: