కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Oparation sindhur) లో భారీ నష్టాలు చవిచూసిన పాకిస్తాన్ అనంతరం అమెరికా అధ్యక్షుడి జోక్యంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. అలాగే బారత్ కూడా అమెరికా సూచన మేరకు కాల్పుల విరమణకు సై అంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ మధ్య ఇవాళ కీలక చర్చలకు కూడా అంగీకరించారు. ఈ మేరకు ఇవాళ ఇరు దేశాల డీజీఎంఏలు భేటీ అయ్యారు. భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ కషిఫ్ చౌదరి మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఇందులో వీరిద్దరూ పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అయితే కాశ్మీర్ అంశంపై మాత్రం వీరు చర్చించడం లేదు. వీరి భేటీలో చర్చిస్తున్న అంశాల్లో కశ్మీర్లో చొరబాట్లు, సైనిక కార్యకలాపాల నిలిపిపేత, వైమానిక చొరబాట్లు, సరిహద్దు తీవ్రవాదం వంటివి ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ లోకి చొప్పించడం ఆపాలని మన దేశం కోరుతోంది. లాంచ్ ప్యాడ్‌లను మూసివేయడం,డ్రోన్లు చొరబడకుండా చూడటం, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వదలకుండా ఉండటం, డ్రోన్‌ల ద్వారా మాదకద్రవ్యాలను పంపడం మానేయడం వంటివి భారత్ తరఫున డిమాండ్లుగా ఉన్నాయి. వీటికి పాకిస్తాన్ ఏ మేరకు అంగీకరిస్తుందన్న దానిపైనే తదుపరి చర్చలు లేదా యుద్దం వంటి నిర్ణయాలు ఆధారపడి ఉన్నాయి.

డీజీఎంఓ చర్చలు:
హాట్‌లైన్ ద్వారా కీలక మంతనాలు ఆపరేషన్ సిందూర్ (Oparation sindhur) నేపథ్యంలో అమెరికా జోక్యంతో పాకిస్తాన్ డీజీఎంఏ జనరల్ కషీఫ్ చౌదరి భారత డీజీఎంఏ రాజీవ్ ఘాయ్ తో కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. దీంతో భారత్ కూడా దీనికి ఒప్పుకుంది. దీంతో రెండు రోజుల క్రితం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే అదే రోజు పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దీనిపై భారత్ వెంటనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో నిన్న పరిస్దితి పూర్తి ప్రశాంతంగా మారింది. దీంతో ఇవాళ ఇరు దేశాల డీజీఎంఏలు చర్చలు జరుపుతున్నారు. భారత తరఫున: మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ ఘాయ్ పాకిస్తాన్ తరఫున: మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ కషీఫ్ చౌదరి.
భారత్ డిమాండ్లు..
ఉగ్రవాదుల చొరబాట్లకు కట్టడి
డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ పంపడాన్ని నిలిపివేయాలి
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను మూసివేయాలి
సరిహద్దుల్లో డ్రోన్ గస్తీ నిరోధించాలి.
Read Also: Oparation sindoor: విక్రమ్ మిస్రీపై అసభ్య ట్రోలింగ్..