అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థ శరవేగంగా మారుతున్న తరుణంలో అమెరికా(America) ఇకపై ప్రపంచాన్ని ఏకపక్షంగా నడిపించే శక్తి కాదనే వాస్తవం మరింత స్పష్టమవుతోంది. భారత్, చైనా కేంద్రంగా ఒక కొత్త ప్రపంచ క్రమం (New World Order) రూపుదిద్దుకుంటోందన్న అభిప్రాయం వాషింగ్టన్ పాలసీ వర్గాల్లో ఆందోళనకు దారి తీస్తోంది. ముఖ్యంగా భారతదేశంపై అమెరికా విధించిన సుంకాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో.. న్యూఢిల్లీ తన వ్యూహాత్మక దిశను మరింత స్పష్టంగా మార్చుకుంటోంది.
Read Also: Phone Tapping Case: KCRకు సిట్ నోటీసులు.. స్పందించిన కవిత

అమెరికా టారిఫ్ ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా.
.ఫైటర్ జెట్‌లు, కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, ఔషధ రంగం వంటి కీలక వ్యూహాత్మక విభాగాల్లో పట్టు సాధించడంపై భారత్ దృష్టి సారించింది. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక, జాతీయ భద్రతను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. సరిహద్దు వివాదాలను నియంత్రణలో ఉంచుతూ.. ఆర్థిక సహకారం, వ్యూహాత్మక సంభాషణలను కొనసాగించాలనే దిశగా న్యూఢిల్లీ, బీజింగ్ అడుగులు వేస్తున్నాయి. భారత్, China రెండూ ఇప్పటికే రష్యాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఇది అమెరికా ఆధిపత్యానికి సవాల్‌గా మారుతోందన్న భావన వాషింగ్టన్‌లో పెరుగుతోంది.
కమిషన్ నోటీసు ప్రకారం..
ఈ విచారణలో భారత్‌కు సంబంధించిన భౌగోళిక రాజకీయ, సైనిక అంశాలు ప్రధానంగా పరిశీలించబడతాయి. భారత్-చైనా మధ్య వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల ఉద్రిక్తతలు, హిందూ మహాసముద్రంలో సముద్ర ప్రాప్యత, ఇండో-పసిఫిక్ శక్తిగా భారతదేశం పాత్ర వంటి అంశాలు విచారణలో కీలకంగా నిలవనున్నాయి. అంతేకాదు వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, ఔషధ సరఫరా గొలుసులు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారత్-చైనా ఆర్థిక, సాంకేతిక సంబంధాలు కూడా సమీక్షకు లోనవుతాయి. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి వాషింగ్టన్ చేపడుతున్న విధాన ప్రయత్నాలు, అలాగే భారత్-చైనా సన్నిహిత సంబంధాలు అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతా ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్న అంశాన్ని కూడా కమిషన్ పరిశీలించనుంది. ఈ విచారణకు కమిషనర్ హాల్ బ్రాండ్స్, కమిషనర్ జోనాథన్ ఎన్. స్టివర్స్ సహ-అధ్యక్షత వహించనున్నారు. ఇదిలా ఉండగా భారతదేశం తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వేలో AI విప్లవానికి తన దిశను స్పష్టంగా వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: