हिन्दी | Epaper

Oparation sindoor: విక్రమ్ మిస్రీపై అసభ్య ట్రోలింగ్..

Shobha Rani
Oparation sindoor: విక్రమ్ మిస్రీపై అసభ్య ట్రోలింగ్..

విక్రమ్ మిస్త్రీ (Vikram mistry). భారత విదేశాంగ కార్యదర్శి. పహల్గాం ఘటన.. ఆపరేషన్ సింధూర్ .. భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పాత్ర పోషించారు. తాజా పరిణామాల పై ఎప్పటికప్పుడు ఆర్మీ అధికారులతో కలిసి ప్రజలకు అందించారు. ఇప్పుడు మిస్రీ తో సహా ఆయన కుటుంబ సభ్యుల పైన అసభ్య కరంగా కొందర ట్రోల్స్ చేస్తున్నారు. కుటుంబలోని వారి ఫోన్ నెంబర్లను లీక్ చేసారు. దీంతో, మిస్రీ కి అండగా రాజకీయ నేతలతో పాటుగా ఐఏఎస్ అధికారులు.. మాజీ రాయబారులు రంగంలోకి దిగారు. ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో కీలక పాత్రధారి
భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతల వేళ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్​ మిస్రీ (Vikram mistry) పేరు ప్రముఖంగా వినిపించింది. కల్నల్​ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా దాడుల వివరాల ను ఎప్పటికప్పుడు వెల్లడించారు. కాగా, ఈ నెల 10న భారత్​-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ కాల్పుల విరమణ నిర్ణయాన్ని వెల్లడించిన విక్రమ్​ మిస్రీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్​ మొదలైంది. ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్య పోస్టులు పెట్టారు. దూషణలు.. కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారం తో ట్రోల్స్ చేసారు. దీని పైన ఎంఐఎం అధినేత అసద్ తో సహా పలువురు రాజకీయ నేతలు.. ఐఏఎస్ అధికారులు స్పందించారు.

Oparation sindoor: విక్రమ్ మిస్రీపై అసభ్య ట్రోలింగ్..
Oparation sindoor: విక్రమ్ మిస్రీపై అసభ్య ట్రోలింగ్..

అఖిలేష్ యాదవ్ – అధికారుల మనోధైర్యానికి గాయం
మిస్టరీపైన చేస్తున్న ట్రోల్స్ ను యూపీ మాజీ సీఎం అఖిలేష్ తప్పు బట్టారు. ఇలాంటి స్టేట్​మెంట్స్​ నిజాయితీగా రాత్రి పగలు దేశం కోసం పనిచేసే అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని ఎక్స్​లో పోస్ట్ పెట్టారు. కాల్పుల విరమణ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందిని.. స్వతంత్ర అధికారులు కాదని పేర్కొన్నారు. కొన్ని యాంటీ-సోషల్ క్రిమినల్స్​ బహిరంగంగా అన్ని పరిమితులు దాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. విక్రమ్ మిస్రీ (Vikram mistry), ఆయన కుటుంబపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇదే తరహాలో ఎంఐఎం అధినేత అసద్ సైతం ఘాటుగా స్పందించారు.
అసదుద్దీన్ ఒవైసీ – నిబద్ధతపై ప్రశంస
విక్రమ్ మిస్రీ (Vikram mistry) మంచి, నిజాయితీపరుడైన, కష్టపడి పనిచేసే దౌత్యవేత్తని అసదుద్దీన్​ ఓవైసీ అన్నారు. ఆయన దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. మన సివిల్ సర్వంట్లు, కార్యనిర్వాహక శాఖ కింద పనిచేస్తారని గుర్తు చేసారు. రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయా లకు వారిని నిందించకూడదు. దీనిని గుర్తుంచుకోవాలని ఓవైసీ సూచించారు. విక్రమ్​ మిస్రీ (Vikram mistry), ఆయన కుటుంబాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సిగ్గుచేటు అని మాజీ దౌత్య వేత్త నిరూ పమ మేనన్​ రావు ఘాటుగా స్పందిచారు. మిస్రీ అంకితభావం కలిగిన దౌత్యవేత్తగా పేర్కొన్నారు.

Read Also: CHINA: పాకిస్థాన్‌కు అండగా ఉంటాం: చైనా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

మరో జలసంధి మూసివేత ముప్పు, ప్రపంచానికి భారీ షాక్

మరో జలసంధి మూసివేత ముప్పు, ప్రపంచానికి భారీ షాక్

కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ

కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

యాత్రలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు భారతీయులు మృతి

యాత్రలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు భారతీయులు మృతి

📢 For Advertisement Booking: 98481 12870