हिन्दी | Epaper

IND vs ENG: నల్ల రిబ్బన్లతో భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు కారణం ఏంటంటే?

Anusha
IND vs ENG: నల్ల రిబ్బన్లతో భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు కారణం ఏంటంటే?

భారత్‌,ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ప్రారంభమైంది.లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానం వేదికగా తొలి టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ (England) బౌలింగ్ ఎంచుకోగా టీమిండియా బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఇరు జట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్‌తో ఈ మ్యాచ్‌ బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ నిమిషం పాటు మౌనం కూడా పాటించారు. అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు మౌనం పాటించడంతో పాటు నల్లని రిబ్బ (Black ribbon)న్లు ధరించారు.ఈ నెల 12న అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని 241 మంది సజీవ దహనం కాగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విమానం జనవాసాలపై పడటంతో మృతుల సంఖ్య భారీ పెరిగింది.

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సమీఫంగా ఉండే మేఘానీ నగర్‌లోని జీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. దాంతో మెడికల్ హాస్టల్‌ (Medical Hostel) లోని 38 మంది మరణించారు.ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ హృదయ విదారక ఘటనపై ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం క్రికెటర్లు సోషల్ మీడియా (Social media) వేదికగా స్పందించారు. మృతులకు నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల సందర్భంగా కూడా టీమిండియా ఆటగాళ్లు మౌనం పాటించడంతో పాటు నల్ల రిబ్బన్లతో సంతాపం ప్రకటించారు.

అధికారిక బ్రాడ్‌కాస్టర్స్

తాజా మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ ఆటగాళ్లతో కలిసి మరోసారి నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ (BCCI) తో పాటు అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాయి.అందరూ ఊహించినట్లుగానే టీమిండియా కాంబినేషన్ ఉంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. సాయి సుదర్శన్ అరంగేట్రం చేయగా, 3009 రోజుల తర్వాత కరుణ్ నాయర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఛతేశ్వర్ పుజారా చేతుల మీదుగా సాయి సుదర్శన్ అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు.

Read Also: ENG vs IND: టాస్ ఓడిన గిల్.. తొలి టెస్ట్‌లో భారత్ ఫస్ట్ బ్యాటింగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

కాబూల్, సరిహద్దు ప్రావిన్సులపై పాకిస్తాన్ దాడులు!

కాబూల్, సరిహద్దు ప్రావిన్సులపై పాకిస్తాన్ దాడులు!

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం

ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం

📢 For Advertisement Booking: 98481 12870