हिन्दी | Epaper

Trump: గ్రీన్ ల్యాండ్ కోసం యూరోపియన్ దేశాలపై భారీ సుంకాలు

Vanipushpa
Trump: గ్రీన్ ల్యాండ్ కోసం యూరోపియన్ దేశాలపై భారీ సుంకాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) మరోసారి టారీఫ్ ల బాంబ్ పేల్చనున్నారని తెలుస్తోంది. గ్రీన్ ల్యాండ్ (Greenland) ను స్వాధీనం చేసుకునేందుకు సుంకాల బ్రహ్మాస్త్రం సంధించనున్నారు. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించి అమెరికాను సమర్థించని దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలను విధించవచ్చని ట్రంప్ సూచించారు. గ్రీన్‌ల్యాండ్ సమస్యపై డోనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు చేసిన బలమైన హెచ్చరిక ఇదేనని చెబుతున్నారు. గ్రీన్ ల్యాండ్ విషయంలో సుంకాలను విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటిసారి నేరుగా ప్రస్తావించారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా జాతీయ భద్రతకు చాలా ముఖ్యమైనదని, అందువల్ల దానిపై అమెరికా నియంత్రణ అవసరమని ఆయన వాదిస్తున్నారు. కానీ దీనికి డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ తో పాటూ మిగతా యూరోపియన్ దేశాలు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నాయి.

Read Also: Iran: ఇప్పుడప్పుడే దాడి లేదన్న ట్రంప్

Trump: గ్రీన్ ల్యాండ్ కోసం యూరోపియన్ దేశాలపై భారీ సుంకాలు
Trump: గ్రీన్ ల్యాండ్ కోసం యూరోపియన్ దేశాలపై భారీ సుంకాలు

అమెరికా భద్రతా వ్యూహంలో గ్రీన్‌ల్యాండ్ ఒక ముఖ్యమైన భాగం

దీనిపై వైట్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ..అమెరికా తన ప్రయోజనాలను సాధించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని అన్నారు. ఏదైనా దేశం అమెరికా ప్రణాళికకు మద్దతు ఇవ్వకపోతే సుంకాల ద్వారా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. అమెరికా భద్రతా వ్యూహంలో గ్రీన్‌ల్యాండ్ ఒక ముఖ్యమైన భాగమని, దాని గురించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా తాను వెనుకాడనని ట్రంప్ అన్నారు. ఈ విషయంలో డెన్మార్క్ ను పెద్దగా పట్టించుకోమని చెప్పారు. రీసెంట్ గా రిపబ్లికన్ పార్టీ ‘గ్రీన్‌లాండ్‌ విలీనం రాష్ట్ర హోదా’ అనే పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది. ఆ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని రాండీ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

📢 For Advertisement Booking: 98481 12870