ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా సిద్దమైంది. వేదికగా లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానం ఎంచుకోబడింది. ఈ నెల 20వ తేదీ నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇదే మ్యాచ్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2027 సీజన్‌కి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన సన్నాహకాలను టీమిండియా పూర్తి చేసుకుంది. సీక్రెట్‌గా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడింది. అయితే సాధారణంగా ఇంగ్లండ్ కండీషన్స్ పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. ఇటీవల జరిగిన సిరీస్‌లు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాయి. అయితే భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌లకు స్పిన్‌కు అనుకూలంగా ఉండే వికెట్లు తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇంగ్లండ్ పేస్ విభాగం బలహీనంగా ఉండటంతో ఆ జట్టు స్పిన్ పిచ్‌లకు మొగ్గు చూపవచ్చనే ప్రచారం జరుగుతోంది.
స్పెషలిస్ట్ స్పిన్నర్
ఈ క్రమంలోనే భారత్‌తో సిరీస్‌కు స్పిన్, పేస్‌కు అనుకూలంగా ఉండే వికెట్లను సిద్దం చేయవచ్చని తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలోనే టీమిండియా రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒక్కడిపైనే ఆధారపడకూడదని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. రవీంద్ర జడేజాతో పాటు ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను కూడా ఆడించాలని సూచిస్తున్నారు. జడేజా ఒక్కడినే నమ్ముకుంటే కుదరదని, స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ను కూడా తుది జట్టులో ఆడించాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఎలాంటి కండిషన్స్‌లోనైనా రాణించే సత్తా ఈ ఇద్దరి స్పిన్నర్లకు ఉందని చెప్పాడు.

పిచ్ కండిషన్స్
జడేజా రూపంలో స్పిన్ ఆప్షన్ ఉన్నప్పటికీ టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలి. పిచ్ కండిషన్స్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయో లేవో కూడా చూసుకోవాలి. అయితే కుల్దీప్-జడేజా ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలరు. వారికి ఆ సామర్థ్యం ఉంది.’అని హర్భజన్ సింగ్ (Harbhajan Singh) చెప్పుకొచ్చాడు.భారత్ నలుగురు పేసర్లు, ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇటీవల లార్డ్స్ వేదికగా జరిగిన సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్లో స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్వింగ్ బౌలింగ్‌కు ఇంగ్లండ్ కండిషన్స్ అనుకూలంగా ఉంటాయి. వాతావరణం చల్లగా ఉండి, పిచ్‌పై గ్రాస్ ఉంటే పేసర్లకు తిరుగుండదు. అయితే నాలుగు, ఐదో రోజు వరకు మ్యాచ్ సాగితే మాత్రం స్పిన్నర్లు కీలకమవుతారు.
Read Also: James Anderson: విరాట్ కోహ్లీకి సచిన్ కంటే బౌలింగ్ చేయడం కష్టం: అండర్సన్