గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. భారత సినీ పరిశ్రమ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక, ఇప్పుడు ప్రతిష్ఠాత్మక Golden Globes 2026 వేడుకలో కీలక పాత్ర పోషించనున్నారు. లాస్ ఏంజెలిస్ వేదికగా ఈ నెల 11న జరగనున్న 83వ Golden Globes అవార్డుల కార్యక్రమంలో ఆమె ప్రజెంటర్‌గా కనిపించనున్నారు.ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ప్రియాంకతో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా అవార్డులు అందజేయనున్నారు. కామెడీ స్టార్ నిక్కీ గ్లేజర్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది సినిమాలతో పాటు పాడ్‌కాస్ట్ విభాగాల్లోనూ అవార్డులు ఇవ్వనుండటం విశేషం.
Read Also: Venezuela US war : వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

ప్రియాంకా చోప్రా ప్రాజెక్టుల గురించి
ప్రియాంకా చోప్రా త్వరలోనే ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ప్రియాంకా నటించనుండగా, ఆమె ‘మందాకిని’ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రను పోషించనున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి 2027లో విడుదలకానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: