భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగతలంపై నిఘా ఉంటేందుకు అత్యంత ఆధునిక రక్షణ కవచం గోల్డెన్ డోమ్(Golden Dome)ను రెడీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌లో చేరేందుకు కెనడా(Canada) కూడా ఆసక్తి కనబర్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) స్పందిస్తూ, 51వ రాష్ట్రంగా చేరితే, గోల్డెన్ డోమ్‌ను ఉచితంగా పొందొచ్చని పేర్కొన్నారు. లేదంటే 61 బిలియన్ డాలర్లు ఖర్చు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో(Truth Social) పోస్ట్ చేశారు.మా అద్భుతమైన గోల్డెన్ డోమ్(Golden Dome) వ్యవస్థలో భాగం కావాలంటే కెనడాకు 61 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని చెప్పా. కానీ, అమెరికాకు 51వ రాష్ట్రంగా మారితే దీనికి జీరో డాలర్లు ఖర్చువుతాయి. వారు ఈ ఆఫర్‌ను పరిశీలుస్తున్నారు’ అని ట్రంప్ పోస్ట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై నిఘా
గోల్డెన్ డోమ్‌కు 175 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై నిఘా ఉంచుతుంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే గుర్తిస్తుంది. చాలావరకు అవి టేకాఫ్ అవ్వక ముందే లేదా మార్గమధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా గోల్డెన్ డోమ్ వ్యవస్థకు ఉంటుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్ సెప్టర్ల నెట్‌వర్కే అత్యంత కీలకం. వీటిల్లో లేజర్ ఆయుధాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదొక రకంగా రోనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన స్టార్‌వార్స్ వ్యవస్థ లాంటిదే. ఈ ప్రాజెక్ట్ ను పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్‌ఫోర్స్‌కు చెందిన ఫోర్‌స్టార్ జనరల్ మైఖేల్ గుట్లిన్ నియమించారు ట్రంప్. ఆయనకు ఎయిర్‌ఫోర్స్‌లో 30 ఏళ్లు పనిచేశారు. 2021 నుంచి స్పేస్ ఫోర్స్‌కు పనిచేస్తున్నారు. మిసైల్ డిఫెన్స్, స్పేస్ సిస్టమ్స్‌లో నిపుణుడిగా ఆయన పేరొందారు. ఈ ప్రాజెక్ట్ కోసం అంతిమంగా 175 బిలిమన్ డాలర్ల ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. మూడేళ్లలోనే డోమ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అంతరిక్షంలోకి పంపడం అంత తేలికైన విషయం కాదు
యూఎస్ విశాలమైన దేశం కాబట్టి అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే అంతరిక్షంలో ఇంటర్‌సెప్టర్లతో ఓ నెట్‌వర్క్‌నే సృష్టించాల్సి ఉంటుందని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫారెన్ పాలసీ ప్రోగ్రామ్ పరిశోధన విభాగం డైరెక్టర్ మిషెల్ ఓ హన్‌లోన్ వెల్లడించారు. లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత తేలికైన విషయం కాదన్నారు. అందుకోసం భారీగా ఇంధనం, అద్దాలు, ఇతర సామగ్రిని భారీ మొత్తంలో అంతరిక్షంలోకి పంపాల్సి ఉంటుందన్నారు. కాగా, గోల్డెన్ డోమ్ ను చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే రెడీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను చైనా, రష్యా తీవ్రంగా వ్యతిరేస్తున్నాయి. ఇవి తీవ్రస్థాయిలో అస్థిరతలను సృష్టిస్తాయని, అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని ఆయా దేశాలు మండిపడుతున్నాయి.
Read Also: Vizag-Abu Dhabi flight : జూన్ 13 నుంచి వైజాగ్-అబుదాబి ఫ్లైట్ సర్వీస్