భూటాన్‌లో ప్రపంచ శాంతి ప్రార్థనలు(Global Peace Prayer) ప్రారంభం అయ్యాయి. నవంబర్ 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ నేతలు, బిక్షువులు, శాంతి దూతలు పెద్ద స్థాయిలో ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొంటున్నారు. భూటాన్ రాజధాని థింపూలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. బజగురు, కాలచక్ర ప్రార్థనలు నిర్వహించనున్నారు. బౌద్ధమతంలో ఉన్న భిన్నమైన సంప్రదాయాల ఆధ్యాత్మిక గురువులు శాంతి ప్రార్థనల ద్వారా ఐక్యత చాటనున్నారు. భూటాన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. 13 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ప్రఖ్యాత లామాలు, స్కాలర్స్, బౌద్ధ మతంలోని తీరవాడ, మహాయాణ, వజ్రాయన పద్ధతులను పాటించేవారు ఈ ప్రార్థనలకు హాజరవుతున్నారు. శాంతియుత, సంతోషకరమైన భవిష్యత్తు కోసం కావాల్సిన ప్రేమ, కరుణ గురించి అవగాహన క్రియేట్ చేయనున్నారు.
Read Also : Taliban: భారత్‌లో తాలిబన్ తొలి దౌత్యవేత్త నియామకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

పవిత్రమైన జాబ్జీ దోహిచోగ్ క్రియతో గ్లోబల్ పీస్ ప్రేయర్ (Global Peace Prayer)ఫెస్టివల్‌ను ప్రారంభించారు. చాలా అరుదైన ఈ పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. శరీరాన్ని, వాక్కును, నెగటివ్ మైండ్‌ను శుద్ధి చేసే ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ బౌద్ధ సంప్రదాయాలకు చెందిన గురువులు ఇంగ్లీష్, టిబెట్, దోంగ్కా భాషలు ప్రార్థనలు చేపట్టనున్నారు.
భూటాన్ ప్రధాన పండుగ ఏమిటి?
భూటాన్‌లో అతిపెద్ద వేడుక. 1670 నుండి రాజధానిలో మూడు రోజుల పాటు జరిగే థింఫు త్సేచు స్థానికులు మరియు ప్రయాణికులతో సహా వేలాది మందిని ఆకర్షిస్తుంది.
భూటాన్‌లో ప్రార్థన జెండాల ప్రాముఖ్యత ఏమిటి?
సాధారణంగా, భూటాన్‌లో, ఆనందం, దీర్ఘాయువు, శ్రేయస్సు, అదృష్టం మరియు పుణ్యం కోసం మరియు అన్ని జీవులకు కర్మ పుణ్యాన్ని అందించడానికి ప్రార్థన జెండాలను ఎగురవేస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: