ఎట్టకేలకు బంగ్లాదేశ్(Bangladesh)లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. గతేడాది ఆ దేశంలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలోనే షేక్ హసీనా(Haseena) గద్దె దిగి.. భారత్‌కు పారిపోయి వచ్చిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. అయితే సంకీర్ణ కూటమికి అధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్.. దాదాపు ఏడాదిగా బంగ్లాదేశ్ లో పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు మహమ్మద్ యూనస్ వెల్లడించారు. బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి నిరంకుశ పాలన సాగిందని పేర్కొన్న ఆయన.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో దేశ పౌరులు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని హితవు పలికారు.

దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2026 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ తాజాగా ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో అంతర్గతంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న తీవ్ర రాజకీయ ఒత్తిడి పరిస్థితుల వేళ ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. గతేడాది బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా.. పదవి నుంచి దిగిపోయి దేశం విడిచి పారిపోయిన తర్వాత ఆ దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది.
Read Also: Elon Musk: ట్రంప్-ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు: జేడీ వాన్స్ స్పందన