టీమిండియా క్రికెట్ కోచ్ గౌతం గంభీర్ ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు.ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుతో పాటు ఉండాల్సిన గంభీర్,కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా ఇంగ్లాండ్ పర్యటనను మధ్యలోనే వదిలి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తల్లి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగానే గంభీర్ తన తల్లి వద్ద ఉండటానికి వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.

మార్గదర్శకత్వం
జూన్ 20న ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు సన్నాహాల్లో భాగంగా గంభీర్ గత వారం ఇంగ్లాండ్‌కు వెళ్లారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు గంభీర్ మార్గదర్శకత్వం ఎంతో కీలకం.శుభమన్ గిల్ (Shubham Gill) కెప్టెన్సీలో రానున్న ఈ సిరీస్ కొత్త శకానికి నాంది పలకనుంది.గంభీర్ తిరిగి ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చి సిరీస్‌కు అందుబాటులోకి వస్తారని భావిస్తున్నారు. ఈ కఠిన సమయంలో ఆయన తల్లి త్వరగా కోలుకోవాలని, గంభీర్ కుటుంబానికి ధైర్యం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ సంఘటన జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే, గంభీర్ లేకపోయినా, జట్టు తమ సన్నాహాలను కొనసాగిస్తోంది. ఈ రోజు బెకన్ హమ్‌లో నాలుగు రోజుల ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో భారత్ ఆడనుంది.
Read Also: BCCI: రేపు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీ