గల్వాన్ లోయ(Galwan Valley) ఘర్షణల అనంతరం చైనా సంస్థలపై భారత్ విధించిన నిషేధాన్ని సడలించాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ రంగాల్లో అమలవుతున్న కీలక ప్రాజెక్టులకు ఈ ఆంక్షలు అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో, నిబంధనల పునఃసమీక్షకు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.
Read Also: Iran Crisis: ఇరాన్‌లో ఆందోళనలు.. 200 మందికి పైగా మృతి!

గతంలో చైనా కంపెనీలు(Galwan Valley) భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే కఠినమైన అనుమతులు, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉండేది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో, ఈ పరిమితులను కొంత మేర సడలించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై క్యాబినెట్ మాజీ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కూడా నిబంధనల సడలింపుకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: