Bangladesh Fuel Crisis: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసింది. దీని ప్రభావం పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌పై తీవ్రంగా పడింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయం కలగడంతో బంగ్లాదేశ్‌లో డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడింది.
Read Also: Gas Shortage: గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన
మార్చి 9 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులను ఇళ్లకు పంపించి, విద్యుత్, రవాణా ఖర్చులను తగ్గించి ఇంధనాన్ని సంరక్షించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను సంప్రదించి, గౌహతి సమీపంలోని నుమలీగఢ్ రిఫైనరీ నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను వెంటనే సరఫరా చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను కోరింది.

సంక్షోభ నివారణ దిశగా అడుగులు
అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఏర్పడిన ఇంధన కొరతను ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులను ఇళ్లకు పంపడం ద్వారా విద్యాసంస్థల్లో భారీగా వాడే ఎయిర్ కండిషనర్లు, లైట్లు, రవాణా ఖర్చులను ఆదా చేయవచ్చని ప్లాన్ చేస్తోంది. ఈ సెలవుల పొడిగింపు దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన భారాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: