ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య ‘టారిఫ్ వార్’ నడుస్తున్న తరుణంలో.. యూరోపియన్ యూనియన్ (EU), దక్షిణ అమెరికా దేశాల కూటమి (Mercosur) ఒక అసాధారణ అడుగు వేశాయి. దశాబ్దాల కాలంగా సాగుతున్న చర్చల తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత వాణిజ్య ఒప్పందాలలో ఒకటి పట్టాలెక్కబోతోంది. ఈ ఒప్పందం ద్వారా అటు అట్లాంటిక్ అవతల ఉన్న దక్షిణ అమెరికా దేశాలు, ఇటు యూరప్ దేశాల మధ్య వ్యాపార సరిహద్దులు చెరిగిపోనున్నాయి. రైతుల ఆందోళన – భారీ ‘బహుమతి’! ఈ ఒప్పందం వల్ల దక్షిణ అమెరికా నుండి చౌకగా ఆహార ఉత్పత్తులు వస్తాయని, తమ మనుగడ కష్టమవుతుందని యూరప్ రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. పర్యావరణ నిబంధనలు తమకు భారంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి EU ఒక భారీ ఎత్తుగడ వేసింది.
Read Also: IndianPolice Jobs:SSC కానిస్టేబుల్- 2025 ఫలితాలు విడుదల

నిపుణులు దీనిని ఒక ‘భారీ లంచం’ గా అభివర్ణిస్తున్నప్పటికీ, ఒప్పందం యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా ఈ ఖర్చు తప్పదని EU భావిస్తోంది. ఈ ఒప్పందాన్ని సరదాగా ‘కౌస్ ఫర్ కార్స్’ అని పిలుస్తున్నారు. దీని అర్థం చాలా స్పష్టంగా ఉంది.. దక్షిణ అమెరికా లాభం: బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాలు తమ మాంసం (Meat), చక్కెరను యూరప్ మార్కెట్ కు సులభంగా ఎగుమతి చేస్తాయి. యూరప్ లాభం: జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్, BMW వంటి కార్ల కంపెనీలు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే దక్షిణ అమెరికాలో అమ్ముకోవచ్చు. ప్రస్తుతం దక్షిణ అమెరికాలో కార్ల విడిభాగాలపై ఉన్న 35% టారిఫ్ రద్దు కానుంది. ఇది చైనా కార్ల కంపెనీలతో పోటీ పడుతున్న యూరప్ ఆటోమొబైల్ రంగానికి ఒక గొప్ప ఊరట.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: