ఇటీవల విదేశీ చదువులకు, ఉద్యోగాలకు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు మన భారతీయులు. దీంతో లక్షలు ఖర్చుపెట్టి, ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నారు. అక్కడే సెటిల్ అయిపోతున్నారు. (Foreign Minister) అయితే వీసాల గడువు ముగిసినా కూడా వెనక్కి రాకుండా అక్రమంగా ఆయాదేశాల్లోనే నివసిస్తున్నవారిని ఆ దేశాలు బహిష్కరణకు గురిచేసింది.
Read Also: China: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్

విదేశీ వ్యవహారాల శాఖ నివేదిక ప్రకారం..
ఈ ఏడాది ఆయా దేశాల నుంచి భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. చాలామంది అమెరికా నుంచి ఎకువ మంది బహిష్కరణకు గురైనట్లు వార్తలు వచ్చాయి. (Foreign Minister) తాజా లెక్కలను బట్టి చూస్తే అదంతా ఒట్టిదని తేలిపోయింది. అమెరికా(America) నుంచి కేవలం 3,414 మంది బహిష్కరణకు గురైతే సౌదీ అరేబియా నుంచి ఏకంగా 11,000 మంది బహిష్కరణకు గురైనట్లు నివేదిక తెలిపింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ రాజ్యసభకు సమర్పించిన నివేదికతో వివరాలు వెల్లడిలోకి వచ్చాయి. ఇటీవల అందించిన డేటా ప్రకారం 2025లో 24,600 మంది భారతీయులను 81 దేశాలు స్వదేశానికి పంపించాయని పేర్కొంది. అమెరికా నుంచి 3,414 మంది, సౌదీ అరేబియా నుంచి 11,000 మంది, హుస్టన్ నుంచి 234 మంది, మయన్మార్ (1,591), మలేషియా (1,485), యూఏఈ (1,469), బహ్రెయిన్ (764) థాయ్ లాండ్ (481), కంబోడియా (305) మంది బహిష్కరణకు గురైన వారిలో ఉన్నారు. యూకేలో 170మంది, ఆస్ట్రేలియాలో (114), రష్యా (82), యూఎస్ (45) మంది విద్యార్థులు వీసా గడువు ముగిసి పోయినా చెల్లుబాటు అయ్యే పర్మిట్లు లేకపోవడంతో బహిష్కరణకు గురైనట్లు తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: