భూటాన్ లో వరదలు ముచ్చెత్తుతున్నాయి. గత కొన్నిరోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు(heavy rains) భూటాన్ అతలాకుతలమైంది. ఆకస్మికంగా వచ్చిన ఈ వరదల వల్ల వేలాదిమంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఎంతమంది చనిపోయారనే విషయం ఇంకా తెలియాల్సిఉంది. అయితే భారీ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు కొట్టుకునిపోయాయి. ఇక బ్రిడ్జ్లు కొట్టుకునిపోవడంతో కొన్ని గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
Read Also: K-SOS app: కోటా విద్యార్థుల ఆత్మహత్యకు చెక్ పెట్టే మొబైల్ యాప్
భారత్ సాయం కోరిన భూటాన్
వరదల్లో పలు గ్రామాలు చిక్కుకునిపోయాయి. దీంతో వారిని ఆదుకునేందుకు భూటాన్ అధికారులతో పాటు భారత సైనికులు సహాయక చర్యలు చేపట్టారు. వరదల కారణంగా చిక్కుకున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూటాన్ హెలికాప్టర్ పనిచేయకపోవడంతో భారత్ కు అత్యవసర సహాయం కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భారత సైన్యం వెంటనే స్పందించి వరదల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా రక్షించింది. అయితే ఈ వరదల కారణంగా ఇప్పటివరకు ఎంతమంది మరణించారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. వరదల్లో చిక్కున్న గ్రామస్తులను సురక్షించంగా రక్షించేందుకు యుద్ధ పాతిపదికంగా సహాయక చర్యలు(Relief measures) కొనసాగుతున్నాయి.
భూటాన్‌లో వరదలు ఎప్పుడు ప్రారంభయ్యాయి?
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూటాన్‌లో వరదలు ముచ్చెత్తుతున్నాయి.
వరదల కారణంగా ఎన్ని ప్రజలు ప్రభావితులయ్యారు?
వేలాదిమంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. మరణాల సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: