అమెరికాలోని న్యూయార్క్ (New York), న్యూజెర్సీ (New Jersey) నగరాలకు వరదలు (Flash Floods) ముంచెత్తాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. ఈ వరదలకు అనేక ఇళ్లు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. రవాణా ఆగిపోయింది. ఈ ప్రభావం విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, అధిక వర్షపాతం కారణంగా అత్యవసర పరిస్థితి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలను పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.

విమానాలు ఆలస్యం
మరోవైపు న్యూయార్క్ సిటీలోని మన్‌హటన్, బ్రూక్లిన్, క్వీన్స్, స్టేటెన్ ఐలాండ్ ప్రాంతాలకు నేషనల్ వెదర్ సర్వీస్ ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు న్యూయార్క్ సిటీ మెట్రో వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. సబ్‌వేల్లోకి వరద పోటెత్తింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో అనేకమంది నివాసితులు అంధకారంలో ఉండిపోయారు. పలు ప్రాంతాలను వరదలు(Flash Floods) చుటుముట్టడంతో వేలాది మంది నివాసితులు జలదిగ్భందంలో చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపాయి. వరదలు, వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
యార్క్‌లో వరదలకు కారణం ఏమిటి?
యార్క్‌కు ఉత్తరాన ఉన్న నిటారుగా ఉన్న ప్రాంతం (వాలులు) వేగవంతమైన ఉపరితల ప్రవాహానికి మరియు తక్కువ నేల చొరబాటుకు కారణమవుతుంది. నార్త్ యార్క్ మూర్స్‌లోని కొన్ని ప్రాంతాలలో అటవీ నిర్మూలన తక్కువ అడ్డంకికి మరియు ఎక్కువ ఉపరితల ప్రవాహానికి దారితీసింది.
న్యూయార్క్ నగరంలో అత్యంత దారుణమైన వరద ఏది?
అమెరికాలో శాండీ అత్యధిక నష్టాన్ని కలిగించింది, దీని ఫలితంగా $65 బిలియన్ల నష్టం మరియు 160 మంది మరణించారు. న్యూయార్క్ మరియు న్యూజెర్సీలు అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నాయి మరియు న్యూయార్క్ నగరం తుఫాను కారణంగా దెబ్బతింది, దీని వలన భారీ వరదలు మరియు నష్టం సంభవించింది.
Read hindi news: hindi.vaartha.com