అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trup), టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య గురువారం సోషల్ మీడియా వేదికగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ పేరు తెరపైకి రావడం అమెరికా రాజకీయాల్లో కలకలం రేపింది. ఎప్స్టీన్ కేసు ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్ ను బయటపెట్టడం లేదని మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఆ పోస్ట్‌ను మస్క్ తొలగించడం గమనార్హం.

శుభం కలుగుగాక, డీజేటీ!
ఎలాన్ మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో, “ఎప్స్టీన్ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఉంది. అందుకే వాటిని ఇప్పటివరకు బయటపెట్టలేదు. శుభం కలుగుగాక, డీజేటీ!” అంటూ ట్రంప్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్‌ను డిలీట్ చేశారు. అంతకుముందు, గురువారం జరిగిన సోషల్ మీడియా పోరులో, “ఈ పోస్ట్‌ను భవిష్యత్తు కోసం గుర్తుపెట్టుకోండి, నిజం బయటకు వస్తుంది” అని కూడా మస్క్ పేర్కొన్నారు.
ట్రంప్ “బిగ్ బ్యూటిఫుల్ బిల్” విషయంలో ఆయనతో విభేదించి, ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన మస్క్, ప్రభుత్వ సామర్థ్య విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి తప్పుకుని తన వ్యాపారాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ట్రంప్‌తో ఆయనకు విభేదాలు తలెత్తాయి. “నేను లేకపోతే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారు, డెమొక్రాట్లు హౌస్‌ను నియంత్రించేవారు.
Read Also: Vatican: వాటికన్ కు డబ్బు ఎలా సమకూర్చబడుతుంది..వెంటాడుతున్న బడ్జెట్ సమస్య