ఇటీవలకాలంలో ప్రకృతి వైపరీత్యాలు(Natural disasters) బాగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు అధిక వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం, క్లౌడ్ బరస్ట్ వంటి సంఘటనలతో పాటు భూకంపాలు కూడా పెరుగుతున్నాయి. అఫ్ఘనిస్తాన్, మయన్మార్, థాయ్లాండ్, జపాన్ వంటి దేశాల్లో భారీ భూకంపాలతో ఎంతోమంది మరణించారు. తాజాగా శనివారం ఉదయం వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్ లో 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
Read Also: UNO: పాక్ ప్రధానిని కడిగిపడేసిన భారత దౌత్యవేత్త గెహ్లాట్

చైనా భూకంప నెట్ వర్క్ సెంటర్ ప్రకారం.
చైనా భూకంప నెట్ వర్క్ సెంటర్(Network Center) ప్రకారం డింగ్సీ నగరంలోని లాంగ్జీ కౌంటీలో ఉదయం 5 ఫ49 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. భయంతో పరుగుతు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి పాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొన్ని భవనాలు నేలమట్టం అయ్యాయి. కానీ ఎవరూ మరణించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
చైనాలో భూకంపం ఎక్కడ జరిగింది?
చైనా వాయువ్య గాన్సు ప్రావిన్స్‌లోని డింగ్సీ నగరంలోని లాంగ్జీ కౌంటీలో జరిగింది.
భూకంప తీవ్రత ఎంత?
భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌లో 5.6 గా నమోదైంది
Read hindi news: hindi.vaartha.com
Read Also: