UAE ప్రభుత్వం గోల్డెన్ వీసా (Golden Visa) స్కీమ్‌పై సోషల్ మీడియా మరియు ఇతర ప్లాట్‌ఫారాల ద్వారా ప్రచారం జరుగుతున్న రూమర్లను ఖండించింది. గోల్డెన్ వీసా కోసం థర్డ్ పార్టీలు, నకిలీ వెబ్‌సైట్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తప్పుడు సమాచారం వ్యాపించడంతో, ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ వీసాకు సంబంధించి ఎలాంటి హక్కులు థర్డ్ పార్టీకి ఇవ్వలేదని స్పష్టం చేసింది.
దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించండి
గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు తప్పకుండా UAE ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్‌ల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలాంటి మధ్యవర్తుల్ని సంప్రదించకూడదని, వారు మోసపూరితంగా డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తప్పుదారి పట్టే ప్రకటనలపై మోసపోవద్దని, వాస్తవ సమాచారం కోసం అధికారిక మార్గాలనే అనుసరించాలని పౌరులు అవగాహనతో ఉండాలని కోరారు.
మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు
ఈ విషయంలో ఎవరైనా మోసాలకు పాల్పడితే, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని UAE అధికారులు హెచ్చరించారు. మోసాలకు గురయ్యాననిపిస్తే లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం కావాలంటే, 600522222 అనే అధికారిక హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, అధికారిక సమాచారం మీదే నమ్మకాన్ని ఉంచాలని UAE ప్రభుత్వం పునరుద్ఘాటించింది.
Read Also : AP BJP Chief : బిజెపి రాష్ట్ర చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మాధవ్