అమెరికా రక్షణ రంగానికి సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సైనిక సంపత్తి వినియోగంలో తమ విధానాన్ని మారుస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా యుద్ధ తంత్రంలో వనరుల వినియోగంపై కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా సైనిక శక్తిని మరింత పొదుపుగా, అదే సమయంలో మరింత శక్తివంతంగా మార్చడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Israel Iran war : యుద్ధ భయం, స్నానం కోసం యాప్ వాడుతున్న ఇజ్రాయెలీలు?
మిస్సైళ్ల కంటే భారీ యుద్ధ నౌకలే మేలు
సైనిక వ్యయంపై ట్రంప్ తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. సుమారు 3 మిలియన్ డాలర్ల ఖరీదైన రాకెట్లను ప్రయోగించడం కంటే, భారీ తూటాలను ప్రయోగించే సామర్థ్యం ఉన్న యుద్ధ నౌకలను వినియోగించడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల రక్షణ వ్యయం తగ్గడమే కాకుండా, శత్రువుల గుండెల్లో మరింత భయాన్ని పుట్టించవచ్చని ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆర్థిక క్రమశిక్షణతో కూడిన రక్షణ వ్యవస్థను ఆయన కోరుకుంటున్నారు.

చాలా మంది తనను యుద్ధం కోరుకునే వ్యక్తిగా చిత్రీకరిస్తుంటారని, కానీ వాస్తవానికి 8 యుద్ధాలను ముగించింది తానేనని ట్రంప్ గుర్తుచేశారు.రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధినేతల మధ్య తీవ్రమైన ద్వేషం ఉందని, వారిని చర్చలకు ఒప్పించడం చాలా కష్టమైన పని అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సముద్రం అడ్డుగా ఉండటం వల్ల ఆ యుద్ధం ప్రభావం అమెరికాపై పెద్దగా ఉండదని, కేవలం యూరప్ కు మేలు చేసేందుకే తాను ఈ ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు.
ఇదే సమయంలో భారత్-పాకిస్థాన్ ల, మధ్య ఉద్రిక్తతలపైనా ఆయన స్పందించారు. ఆ రెండు దేశాల మధ్య పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నప్పుడు, తాను వాణిజ్యపరమైన సుంకాలను అస్త్రంగా ప్రయోగించి సమస్యను పరిష్కరించానని, ప్రజల ప్రాణాలను కాపాడానని ట్రంప్ పేర్కొన్నారు. ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం తనకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: