ఇండియన్ క్రికెట్ టీం స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohil)టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్నీ తెలిపారు. అయితే విరాట్ కోహ్లీ (Virat Kohil) గురించి ఫ్యాన్స్’కి తెలియని కొన్ని విషయాలు ఇప్పటికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకంటే కోహ్లీ క్రికెట్ గ్రౌండ్లోనే కాదు, బిజినెస్లోను మంచి ప్లేయర్. అతనికి చాల కంపెనీలలో భారీ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇంకా సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్, X (Instagram, X)లో పోస్టుల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. అంతేకాదు విరాట్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 1000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
మీడియా (Media) నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ మొత్తం నికర విలువ రూ.1090 కోట్లు. కోహ్లీ చాలా బ్రాండ్లకి ప్రమోషన్ కూడా చేస్తాడు అలాగే సొంత వ్యాపారాన్ని కూడా నడుపుతున్నాడు. విరాట్ కోహ్లీ చాల స్టార్టప్‌లలో పెట్టుబడులు కూడా పెట్టడం విశేషం. విరాట్ దగ్గర కాస్ట్లీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. అంతేకాక విరాట్‌కు చాల చోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి, వీటి మొత్తం అంచనా విలువ దాదాపు రూ. 140 కోట్లు.

క్రికెట్ ద్వారా మీరు ఎంత సంపాదిస్తాడంటే
క్రికెట్’తో పాటు విరాట్ బిజినెస్ల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. ముందుగా క్రికెట్ ద్వారా సంపాదన గురించి మాట్లాడితే బీసీసీఐ నుంచి విరాట్’కు ఏడాది జీతం 7 కోట్లు. ఇది కాకుండా అతను ప్రతి టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్లలో ఒక్కో మ్యాచ్’కు రూ.6 లక్షలు అందుకుంటున్నాడు. అతను టి-20 నుండి కూడా రిటైర్ అయినా సంగతి మీకు తెలిసిందే. కానీ ఒక టీ-20 మ్యాచ్’కు రూ. 3 లక్షలు తీసుకునేవాడు. మొత్తంగా ఐపీఎల్ నుండి సంవత్సరానికి రూ. 15 కోట్లు సంపాదిస్తున్నారు.
యాడ్స్ ఇంకా సోషల్ మీడియా ద్వారా సంపాదన
విరాట్ కోహ్లీ యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నాడు. అతను ఒక యాడ్ కోసం రూ. 10 కోట్లకు పైగా తీసుకుంటాడని సమాచారం. ఇక ఇన్‌స్టాగ్రామ్ అండ్ Xలో పోస్ట్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం, విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు దాదాపు రూ. 9 కోట్లు, Xలో ఒక్కో 100 కోట్లకు పైగా ఆస్తి: విరాట్’కు దాదాపు రూ.140 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఆయనకు గురుగ్రామ్‌లో రూ.80 కోట్ల విలువైన బంగ్లా, ముంబైలో రూ.34 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, అలీబాగ్‌లో రూ.20 కోట్ల విలువైన ఫామ్‌హౌస్, రూ.6 కోట్ల విలువైన విల్లా ఉన్నాయి.
స్టార్టప్‌లలో పెట్టుబడి
విరాట్ కోహ్లీ చాలా కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టాడు. వీటిలో రేజ్ కాఫీ, డిజిట్, MPL, హైపరైస్, బ్లూ ట్రైబ్ మొదలైనవి ఉన్నాయి. ఆయన స్వయంగా కొన్ని స్టార్టప్‌లను కూడా నడుపుతున్నారు. వీటిలో One8, Wrogn ప్రముఖమైనవి. విరాట్ చాలా పెద్ద బ్రాండ్లకు అడ్వాటైజింగ్స్ కూడా చేస్తుంటాడు. కొన్ని నివేదికల ప్రకారం, విరాట్ ఒక్కో అడ్వాటైజింగ్ ద్వారా రూ. 7.5 నుండి 10 కోట్లు తీసుకుంటాడట.
Read Also: PM Modi: ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోదీ సందేశం..