Greenland : Denmark ప్రభుత్వం కీలక హెచ్చరిక చేసింది. United States గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమించే ప్రయత్నం చేస్తే, ముందుగా కాల్పులు జరిపి తర్వాతే ప్రశ్నలు అడుగుతామని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. Donald Trump గ్రీన్‌ల్యాండ్‌ను తమ అధీనంలోకి తీసుకోవాలన్న వ్యాఖ్యలను పదే పదే చేస్తుండటంతో ఈ ప్రకటన వెలువడింది.
డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ Berlingske కు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, విదేశీ దాడి జరిగితే సైనికులు ఎలాంటి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా వెంటనే స్పందించాల్సి ఉంటుంది. సైనిక నిబంధనల్లోని 1952 నాటి నియమం ప్రకారం, యుద్ధ ప్రకటనపై కమాండర్లకు సమాచారం లేకపోయినా కూడా ఆక్రమణకు తక్షణమే ప్రతిఘటన చేయాలని స్పష్టం చేస్తోంది.
Read also: The RajaSaab box office : ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?
వెనిజువెలాపై విమర్శలు చేసిన (Greenland) అనంతరం, ట్రంప్ మళ్లీ గ్రీన్‌ల్యాండ్‌పై తన ఆకాంక్షను పునరుద్ఘాటించడంతో డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఈ ఘాటు వ్యాఖ్యలు వచ్చాయి.
ఇదిలా ఉండగా, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ Karoline Leavitt మాట్లాడుతూ, “గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోవడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలక అంశమని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను అడ్డుకోవాలంటే ఇది అవసరం” అని వ్యాఖ్యానించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: