26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ వర్గాలు బుధవారం వెల్లడించాయి. రూ.63,000 కోట్లకు పైగా విలువైన ఈ ఒప్పందం రాబోయే వారాల్లో అధికారికంగా అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా 22 సింగిల్-సీటర్ జెట్‌లతో పాటు నాలుగు ట్విన్-సీటర్ వేరియంట్లు ఇండియన్ నేవీలో చేరనున్నాయి. ఫ్లీట్ నిర్వహణ, లాజిస్టికల్ సపోర్ట్, శిక్షణ, స్వదేశీ తయారీ భాగాల కోసం సమగ్ర ప్యాకేజీని అందించనుంది ఫ్రాన్స్. రాఫెల్ మెరైన్ జెట్‌లు సముద్రంలో నావికాదళ వైమానిక శక్తిని గణనీయంగా పెంచుతాయి.

2029 చివరి నాటికి ఇండియన్ నేవీ చేతికి వస్తాయి
రాఫెల్ యుద్ధ విమానాలకు ఈ రాఫెల్ మెరైన్ అడ్వాన్డ్స్ వెర్షన్. ఈ రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్‌లు 2029 చివరి నాటికి ఇండియన్ నేవీ చేతికి అందుతాయి. మొత్తంగా 2031 నాటికి డీల్ కంప్లీట్ అవుతుంది. ఈ జెట్‌లు భారతదేశ విమాన వాహక నౌకలైన INS విక్రమాదిత్య, INS విక్రాంత్ నుంచి పనిచేస్తాయి. పాత MiG-29K విమానాల స్థానంలో వీటిని ఉపయోగిస్తారు.
వీటి ప్రత్యేకతలు ఏమిటి?
ఫ్రెంచ్ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్ నుంచి నిర్వహణ మద్దతు ఉంటుంది. ఇక ప్రత్యేకతల విషయానికి వస్తే.. రీన్ఫోర్స్డ్ ల్యాండింగ్ గేర్, అరెస్టర్ హుక్స్, షార్ట్ టేక్-ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ (STOBAR) వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ జె