భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం, పాకిస్థాన్‌కు చైనా సైనిక సహాయం (China’s military Help to Pakistan) అందించిందా అనే ఊహాగానాలు అంతర్జాతీయంగా చర్చకు తెరతీశాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఈ ఆపరేషన్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన క్షిపణుల దాడులు జరిపింది. ఈ దాడులపై చైనా తరపున స్పందించిన విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తాము తటస్థంగా వ్యవహరిస్తామని తెలిపారు.
మావో నింగ్ క్లారిటీ
మావో నింగ్ మాట్లాడుతూ.. “భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలపై మేము ఎప్పటికీ తటస్థంగా ఉన్నాం. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాం. కాల్పుల విరమణ ఒప్పందానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. అలాగే ప్రాంతీయ శాంతి, సుస్థిరత కోసం చైనా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో చైనా పాకిస్థాన్‌కు సైనిక సహాయం అందించిందన్న ఆరోపణలను పరోక్షంగా ఖండించినట్లు కనిపిస్తోంది.
చైనా ఈ వివాదంలో ఎటు తేల్చుకోలేకపోతుంది
ఇక పాకిస్థాన్ తన వద్ద చైనా నుంచి పొందిన హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 వంటి గగనతల రక్షణ వ్యవస్థలపై బలమైన నమ్మకాన్ని పెట్టుకున్నప్పటికీ, భారత ఆపరేషన్ సిందూర్‌లో వాడిన క్షిపణులను అవి అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. ఈ పరిణామంతో, చైనా రక్షణ వ్యవస్థల సమర్థతపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తంగా, చైనా ఈ వివాదంలో తటస్థంగా ఉన్నామన్న సూత్రాన్ని పునరుద్ఘాటించినప్పటికీ, పాకిస్థాన్‌తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని పక్కనపెట్టలేదన్న అభిప్రాయాలు విశ్లేషకులవద్ద వినిపిస్తున్నాయి.
Read Also : Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా విచారణలో బయటపడుతున్న సంచలన విషయాలు