हिन्दी | Epaper

China: బంగారం ధరల పెరుగుదలపై చైనా కొత్త మైండ్ గేమ్

Vanipushpa
China: బంగారం ధరల పెరుగుదలపై చైనా కొత్త మైండ్ గేమ్

బంగారం ధరలను విపరీతంగా పెంచేందుకు చైనా సరికొత్త వ్యూహాలను పన్నుతోంది. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా డ్రాగన్ కంట్రీ దూకుడు చర్యలు ప్రారంభించింది. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు ఎగబాకుతున్నాయంటే అది చైనా తీసుకుంటున్న చర్యల వల్లనేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రపంచ దేశాలకు షాకిస్తూ పొరుగుదేశం చైనా పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటూ పోతోంది. చైనా(China) కేంద్ర బ్యాంకు భారీగా పసిడిని కొనుగోలు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని వల్ల బంగారం ధరలు ఓ పద్దతి పాడూ లేకుండా పెరుగుతున్నాయి. ఇటీవలి వారాల్లో అంతర్జాతీయ బంగారం మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవడానికి కారణం ఈ పరిస్థితులే. చైనాలో జరుగుతున్న అధిక ఊహాజనిత (speculative) ట్రేడింగ్ కార్యకలాపాలు మారడమే ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ట్రెజరీ కార్యదర్శి Scott Bessent కూడా ఈ పరిణామాలపై స్పందిస్తూ.. గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌లో పెరుగుతున్న అస్థిరతకు అనియంత్రిత చైనా ట్రేడింగ్ చర్యలే కారణమని వ్యాఖ్యానించారు.

Read Also: Undavalli: రేపు ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. ప్రాజెక్టులపై కీలక సమీక్ష

China: బంగారం ధరల పెరుగుదలపై చైనా కొత్త గేమ్
China: బంగారం ధరల పెరుగుదలపై చైనా కొత్త గేమ్

అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు

ఇది గత దశాబ్దాల్లో ఒక్కరోజులో చోటుచేసుకున్న అతిపెద్ద తగ్గుదలల్లో ఒకటిగా నిలిచింది. అప్పటి నుంచి Gold ధరలు 5 వేల డాలర్ల స్థాయి పైన స్థిరంగా నిలబడటానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారానికి మద్దతుగా ఉన్నప్పటికీ, ధరల కదలికల్లో చైనా పెట్టుబడిదారుల పాత్ర అసమానంగా పెరిగిందనే అభిప్రాయం బలపడుతోంది. ఫాక్స్ న్యూస్ కార్యక్రమంలో మాట్లాడుతూబెస్సెంట్.. చైనాలో బంగారం ట్రేడింగ్ పరిస్థితులు నియంత్రణ తప్పుతున్నాయని పేర్కొన్నారు. మార్జిన్ అవసరాలను పదే పదే కఠినతరం చేయాల్సి వస్తోందని, బంగారం ఒక క్లాసిక్ స్పెక్యులేటివ్ షాక్ గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ఫ్యూచర్స్ మరియు ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)లో ట్రేడింగ్ గణనీయంగా పెరగడం, అధిక లివరేజ్ వినియోగం ధరల అస్థిరతకు దారితీస్తోంది.

Capital Economics గణాంకాల ప్రకారం.

రిటైల్ పెట్టుబడిదారులు, సంస్థాగత పెట్టుబడిదారులు భౌతిక బంగారం, ETFలు, ఫ్యూచర్స్‌ల మిశ్రమం ద్వారా ఊహాజనిత పెట్టుబడులు పెంచుతున్నారని ఆమె వివరించారు. . 2025 ప్రారంభం నుంచి చైనా బంగారం-ఆధారిత ETF హోల్డింగ్స్ రెట్టింపుకంటే ఎక్కువగా పెరిగాయి. అదే సమయంలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా భారీగా పెరిగాయి. క్యాపిటల్ ఎకనామిక్స్ ఆర్థికవేత్త హమద్ హుస్సేన్ మాట్లాడుతూ.. బంగారంతో అనుసంధానమైన ఆర్థిక ఉత్పత్తులకు చైనాలో పెరుగుతున్న ప్రాప్యతే ఈ అస్థిరతకు కారణమని అన్నారు. లివరేజ్ వినియోగం పెరగడం వల్ల ధరల ఊగిసలాట మరింత తీవ్రమవుతోందని ఆయన హెచ్చరించారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌లో APAC మాజీ పరిశోధనాధిపతి రే జియా ప్రకారం. ఈ ఏడాది సగటు రోజువారీ వాల్యూమ్‌లు 540 టన్నులకు చేరుకున్నాయి. అధిక ఊహాగానాలను అరికట్టేందుకు చైనా నియంత్రణ సంస్థలు మార్జిన్ అవసరాలను పెంచుతూ చర్యలు తీసుకుంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్‌ దాడులు.. అమెరికా సీరియస్!

ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్‌ దాడులు.. అమెరికా సీరియస్!

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

ఖమేనీ వారసుడిగా రెండో కుమారుడు మొజ్తబా ఎన్నిక

ఖమేనీ వారసుడిగా రెండో కుమారుడు మొజ్తబా ఎన్నిక

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

ఇరాన్ కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

ఇరాన్ కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

📢 For Advertisement Booking: 98481 12870