हिन्दी | Epaper

China Tariff : దెబ్బకు దెబ్బ..అమెరికాపై 34శాతం సుంకాలు విధించిన చైనా

sumalatha chinthakayala
China Tariff : దెబ్బకు దెబ్బ..అమెరికాపై 34శాతం సుంకాలు విధించిన చైనా

China Tariff : అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో చైనా దెబ్బకు దెబ్బ అంటూ సంకేతాలు పంపింది. ఈ మేరకు తాజాగా వాషింగ్టన్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఏప్రిల్‌ 10వ తేదీ ఇది అమల్లోకి రానున్నట్లు చెప్పింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై ఇది వర్తిస్తుందని ది స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టారిఫ్‌ కమిషన్‌ వెల్లడించింది. వాషింగ్టన్‌ చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని వెల్లడించింది.

దెబ్బకు దెబ్బ అమెరికాపై 34శాతం

ఏప్రిల్‌ 10 మొదలు అదనపు సుంకాలు

చైనాలోని టారిఫ్‌ చట్టం, కస్టమ్స్‌ చట్టం, విదేశీ వ్యాపార చట్టం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం స్టేట్‌ కౌన్సిల్‌ ఆమోదంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏప్రిల్‌ 10 మొదలు అదనపు సుంకాలు విధిస్తున్నాం అని ది స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టారిఫ్‌ కమిషన్‌ వెల్లడించింది. ఈ కొత్త నిర్ణయంతో ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతులపై ఉన్న పన్నులకు అదనంగా ఈ టారిఫ్‌లు కూడా విధించనున్నారు. కానీ, ఇప్పటికే అమల్లో ఉన్న పన్ను, ఇతర మినహాయింపు పాలసీలు కూడా కొనసాగనున్నాయి. మార్గం మధ్యలో ఉన్న సరకులు మే 13లోపు చేరుకొంటే.. వాటికి మాత్రం మినహాయింపు లభించనుంది.

సుమారు 438 బిలియన్‌ డాలర్ల వస్తువులు ఎగుమతి

కాగా, నిన్న ట్రంప్‌ 34శాతం అదనపు సుంకాలను విధించడంపై బీజింగ్‌ తీవ్రంగా స్పందించింది. తాము తగిన విధంగా ప్రతిస్పందిస్తామని పేర్కొంది. చైనా నుంచి అమెరికాకు ఏటా సుమారు 438 బిలియన్‌ డాలర్ల వస్తువులు ఎగుమతి అవుతుంటాయి. ఇక, అమెరికాతో వాణిజ్య చర్చలపై చైనా స్పందిస్తూ.. తాము వాణిజ్య ఆందోళనలపై వాషింగ్టన్‌తో టచ్‌లో ఉన్నామని చెప్పారు. సమ హోదాలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకొంటామని బీజింగ్‌ వెల్లడించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870