పలువురు యూకే ప్రధానుల సన్నిహితుల మొబైల్ ఫోన్లను సైబర్ దాడులతో చైనా హ్యాక్ చేసిందని ఆరోపిస్తూ బ్రిటిష్ పత్రిక ‘ది టెలిగ్రాఫ్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. డౌనింగ్ స్ట్రీట్‌లోని పలువురు సీనియర్ అధికారుల మొబైల్ ఫోన్లను చాలా ఏళ్లుగా హ్యాక్ చేస్తోందని ఆరోపించింది. టెలిగ్రాఫ్ పత్రిక ఆరోపణలపై చైనా నుంచి ఏలాంటి తక్షణ స్పందన వెలువడలేదు. యూకే (Britain) ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ జనవరి 28న మూడు రోజుల చైనా పర్యటనకు వెళ్లనున్న వేళ టెలిగ్రాఫ్ ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2021 నుంచి 2024 మధ్యకాలంలో జరిగిన ఈ సైబర్ దాడులు, అప్పటి ప్రధానులైన బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్‌ల సన్నిహితులను లక్ష్యంగా చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో చైనాకు దగ్గరయ్యేందుకు స్టార్మర్ చేస్తున్న ప్రయత్నాలకు ఇబ్బందికరంగా మారాయి. కీర్ స్టార్మర్ జనవరి 28 నుంచి 31 వరకు చైనాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు.
Read Also: Ajit Pawar’s Plane Crash : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం
చైనా సాంకేతికత, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, బ్రిటన్ ఆర్థిక సేవలు, కార్లు, స్కాచ్ విస్కీ వంటి ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో మరింత విస్తరించాలని బ్రిటన్ ఆశిస్తోంది. అయితే, ఈ పర్యటనకు ముందే వచ్చిన ఈ హ్యాకింగ్ ఆరోపణలు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. ‘సాల్ట్ టైఫూన్’ అనే కోడ్ పేరుతో జరిగిన ఈ సైబర్ దాడి.. డౌనింగ్ స్ట్రీట్‌లోని కీలక అధికారుల ఫోన్లను లక్ష్యంగా చేసుకుంది. ప్రధానుల వ్యక్తిగత ఫోన్లు ప్రభావితమయ్యాయో లేదో స్పష్టంగా తెలియకపోయినా, ఈ హ్యాకింగ్ ‘డౌనింగ్ స్ట్రీట్‌ను ప్రభావితం చేసింది’ అని నివేదిక పేర్కొంది. గత నవంబర్‌లో బ్రిటన్ గూఢచార సంస్థ MI5 పార్లమెంట్‌కు చైనా గూఢచర్య బెదిరింపుల గురించి హెచ్చరిక జారీ చేసినట్టు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: