China Airlines: భారత్–చైనా మధ్య విమాన ప్రయాణాలు మళ్లీ ఉత్సాహాన్ని సంతరించుకుంటున్నాయి. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ (Airline) షాంఘై–న్యూఢిల్లీ మధ్య విమాన సర్వీసులను పెంచనుందని ప్రకటించింది. ప్రస్తుతం వారానికి మూడు సర్వీసులు ఉన్న చోట, 2026 జనవరి 2 నుంచి ఐదు సర్వీసులు అందించనుంది. భారత మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
Read also: America: మా ఉద్యోగాలను లాగేస్తున్నారు.. అక్కసు వెళ్లగక్కిన యంత్రాంగం

China Airlines: భారత్-చైనా మధ్య మరిన్ని ఎయిర్ సర్వీసులు
China Airlines: ఈ సర్వీసులు సోమ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ నుంచి బయలుదేరే MU564 విమానం రాత్రి 7:55 గంటలకు షెడ్యూల్ కాగా, షాంఘై నుంచి బయలుదేరే MU563 విమానం మధ్యాహ్నం 12:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మార్గంలో 17 బిజినెస్ క్లాస్, 245 ఎకానమీ క్లాస్ సీట్లు కలిగిన ఎయిర్‌బస్ A330-200 విమానాలు నడపనున్నారు. భవిష్యత్తులో షాంఘై–ముంబై, కున్మింగ్–కోల్‌కతా మార్గాల్లోనూ సర్వీసులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఐదేళ్ల విరామం తర్వాత చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఈ ఏడాది నవంబర్ 9 నుంచి ఢిల్లీ–షాంఘై సర్వీసులను తిరిగి ప్రారంభించనుంది. మరోవైపు, ఇండిగో కూడా ఇటీవల చైనాకు సర్వీసులు ప్రారంభించింది. కోల్‌కతా–గ్వాంగ్‌జౌ మధ్య ఇండిగో తొలి విమానం చైనా చేరుకోవడం రెండు దేశాల మధ్య ప్రయాణ, వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించబడుతున్న సంకేతంగా భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: