భారతదేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఏకైక మార్గం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కారిడార్. కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ మార్గాన్ని ‘చికెన్ నెక్‘(Chicken neck) అని పిలుస్తారు. యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల్లో శత్రువులు ఈ చిన్న మార్గాన్ని దిగ్బంధిస్తే, ఈశాన్య రాష్ట్రాలు దేశం నుండి విడిపోయే ప్రమాదం ఉంది. ఈ సవాలు అధిగమించడానికి భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై దృష్టి సారించింది. ఈ భౌగోళిక చిక్కుముడికి కారణం 1947 దేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక తప్పిదాలే.
Read Also: Amazon smartphone offers : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ షురూ, టాప్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

చిట్టగాంగ్ ప్రాంతంలో 90% హిందువులు
1947లో సిరిల్ రాడ్‌క్లిఫ్ భారతదేశాన్ని సందర్శించకుండానే 45 రోజుల్లో విభజన రేఖలు గీశారు. అప్పట్లో మన నాయకులు వాయువ్య సరిహద్దులపై పెట్టిన దృష్టిని బెంగాల్ విభజనపై పెట్టలేదు. నిజానికి చిట్టగాంగ్ ప్రాంతంలో 90% హిందువులు ఉండేవారు. ఇది శతాబ్దాలుగా త్రిపుర రాజ్యంతో ముడిపడి ఉండేది. కానీ, చివరి నిమిషంలో బ్రిటీష్ వారు చిట్టగాంగ్‌ను తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) కు కట్టబెట్టారు. దీనివల్ల ఈశాన్య భారత్ తన సహజసిద్ధమైన సముద్ర మార్గాన్ని కోల్పోయి భూపరివేష్టిత ప్రాంతంగా మిగిలిపోయింది. ప్రస్తుతం భారత్ ఈశాన్య రాష్ట్రాలను సముద్రంతో అనుసంధానించడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను చేపడుతోంది.
కలదాన్ మల్టీ-మోడల్ ప్రాజెక్ట్ (మయన్మార్):
మిజోరం నుండి మయన్మార్ మీదుగా బంగాళాఖాతాన్ని చేరే మార్గం ఇది. దీని ద్వారా మిజోరం నుండి సముద్ర దూరం కేవలం 250 కిలోమీటర్లు మాత్రమే. ఇది బంగ్లాదేశ్‌తో సంబంధం లేకుండా ఈశాన్య రాష్ట్రాలకు భద్రత కల్పిస్తుంది. మైత్రీ సేతు (బంగ్లాదేశ్): త్రిపురలోని సబ్రూమ్ నుండి బంగ్లాదేశ్‌లోని రామగఢ్ వరకు ఫెనీ నదిపై ఈ వంతెన నిర్మించబడింది. ఇక్కడి నుండి చిట్టగాంగ్ పోర్ట్ కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అగర్తలా నుండి కలకత్తాకు రోడ్డు మార్గం 1700 కి.మీ కాగా, చిట్టగాంగ్ మార్గం ద్వారా ఇది చాలా వరకు తగ్గుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: