हिन्दी | Epaper

Telugu news: Brown University: యూనివర్సిటీలో కాల్పులు: ఇద్దరు మృతి,8 మంది గాయపడ్డారు

Pooja
Telugu news: Brown University: యూనివర్సిటీలో కాల్పులు: ఇద్దరు మృతి,8 మంది గాయపడ్డారు

అమెరికా రోడ్ ఐలాండ్ ప్రావిడెన్స్‌లోని ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీ(Brown University) క్యాంపస్‌లో శనివారం ఘోర కాల్పులు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కాల్పులు యూనివర్సిటీలో పరీక్షల సమయంలో చోటుచేసుకున్నాయి. నల్ల దుస్తులు ధరించిన ఒక షూటర్ ఈ ఘోరానికి కారణమయ్యాడు. అతని కోసం ప్రావిడెన్స్ పోలీసులు గాలిస్తున్నారు.

Read Also: Maria Machado: ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకుని నార్వే ప్రయాణం

Brown University
Brown University

దుర్గటన ఘటనా స్థలం

కాల్పులు బారస్ అండ్ హోలీ భవనంలో జరిగాయి, ఇది యూనివర్సిటీ(Brown University) క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ స్కూల్, ఫిజిక్స్ విభాగాలతో కూడిన ఏడతస్తుల కాంప్లెక్స్. భవనంలో 100కి పైగా ల్యాబొరేటరీలు, డజన్ల తరగతి గదులు, కార్యాలయాలు ఉన్నాయి. ఇంజినీరింగ్ డిజైన్ ఫైనల్ పరీక్షల సమయంలో ఈ ఘటనా జరిగింది.

కాల్పుల తర్వాత క్యాంపస్‌ను తక్షణమే లాక్‌డౌన్ చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రావిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, క్యాంపస్ మొత్తం ఎఫ్బీఐ, పోలీసులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు.

దర్యాప్తు & ఫెడరల్ సహాయం

ఘటనా స్థలానికి ఫెడరల్ అధికారులు, ఎమర్జెన్సీ సిబ్బంది చేరుకున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ, సమగ్ర దర్యాప్తుకు ఎఫ్బీఐని ఆదేశించారు. అలాగే, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ (ATF) ఏజెంట్లు కూడా దర్యాప్తులో భాగంగా సహకరించారు.

ప్రస్తుతానికి నల్ల దుస్తుల్లో ఉన్న అనుమానితుడు భవనం నుండి బయటకు వస్తూ విద్యార్థుల చేత గుర్తించబడ్డాడు. అతను ఇంకా పట్టుబట్టలేదని ప్రావిడెన్స్ డిప్యూటీ పోలీస్ చీఫ్ టిమోతీ తెలిపారు.కాల్పుల కారణంగా విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఎవరికీ బయటకు రావద్దని హెచ్చరించారు. తదుపరి ఆదేశాల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరణించిన వ్యక్తుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాలో వీసా మోసం.. 11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ!

అమెరికాలో వీసా మోసం.. 11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ!

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

📢 For Advertisement Booking: 98481 12870