హిమాలయాల నుంచి పుట్టిన యార్లుంగ్ త్సాంగ్పో నది(Yarlung Tsangpo River) టిబెట్‌ను దాటుతూ భారత్‌లో బ్రహ్మపుత్ర(Brahmaputra)గా ప్రవేశిస్తుంది. ఈ నది భోజనం, సాగునీరు, ఉపాధి కోసం లక్షలాది ప్రజలకు ముఖ్య వనరు. కానీ చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా, దక్షిణాసియా భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అంశంగా మారింది.
Read also: US Tariff: యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట
చైనా సుమారు 168 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నిపుణులు అత్యంత పెద్ద, వివాదాస్పద మౌలిక సదుపాయాలల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. నది ప్రవాహంలో 2,000 మీటర్ల ఎత్తును ఉపయోగించి భారీ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. చైనా దీన్ని “హరిత శక్తి” ప్రాజెక్టుగా ప్రచారం చేస్తుండగా, పర్యావరణ శాస్త్రవేత్తలు దీని తీవ్ర ప్రతికూల ప్రభావాలను హెచ్చరిస్తున్నారు.

బ్రహ్మపుత్రపై చైనా చర్యలు: వరదలు, కరువు ప్రమాదాల హెచ్చరిక
డ్యామ్‌లు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలు సొరంగాల ద్వారా అనుసంధానించబడి నిర్మితమవుతాయి. అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, నది సహజ ప్రవాహంలో ఇంత పెద్ద జోక్యం ప్రమాదకరం. చేపల వలస మార్గాలు, వరద నమూనాలు, అవక్షేపాల కదలికలు ఆల్ థిస్ ఏకాలోజికల్ ఫ్యాక్టర్స్ అడ్డుకట్ట పడితే దిగువ ప్రాంతాల్లో వ్యవసాయం, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగే అవకాశముంది.
భారతదేశానికి ఈ ప్రాజెక్ట్ ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. బ్రహ్మపుత్రకు ప్రధానంగా రుతుపవనాల వర్షాలు, ఉపనదుల ద్వారా నీరు వస్తే, ఎగువన జరిగే మార్పులు నది సహజనాడిని దెబ్బతీస్తాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. చైనా ఎప్పుడూ నీటిని నిలిపివేస్తుందో, ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియకపోవడం వల్ల వరదలు, కరువు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే అనేక నిపుణులు ఈ ప్రాజెక్టును “వాటర్ బాంబ్” అని వర్ణిస్తున్నారు.

ప్రాజెక్ట్ వల్ల స్థానికుల సమస్యలు
పర్యావరణ సమస్యలతోపాటు, భౌగోళిక రాజకీయ కోణం కూడా ఉంది. టిబెట్, భారత సరిహద్దు ప్రాంతంలో చైనా మౌలిక సదుపాయాలను పెంచడం వ్యూహాత్మక చర్య సహజ వనరుల నియంత్రణ ద్వారా సరిహద్దు ప్రాంతాలపై ఆధిపత్యం సాధించడమే దీని దీర్ఘకాలిక లక్ష్యం. మెకాంగ్ నది విషయంలో కూడా చైనా ఈ విధంగా డ్యామ్‌లు నిర్మించి దిగువ దేశాల్లో కరువు సమస్యలు సృష్టించిందని ఆరోపణలు ఉన్నాయి.
ఇలా నిర్మించబడే ప్రాజెక్ట్ వల్ల టిబెట్‌లోని స్థానిక తెగల ప్రజలు తమ భూములను వదలవలసి వస్తున్నారు. బలవంతపు తరలింపులు వారి సంస్కృతి, ఉపాధి వనరులను నాశనం చేస్తాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల స్థానంలో ఇతర ప్రాంతాల వలస కార్మికులను తీసుకురావడం ద్వారా జనాభా సమీకరణం మారే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు ఉన్నాయి.
భారత ప్రభుత్వం ఈ చర్యలను పక్కాగా గమనిస్తోంది. బ్రహ్మపుత్రపై సుమారు 11,200 మెగావాట్ల సామర్థ్యం గల డ్యామ్ నిర్మాణం ప్రతిపాదనలో ఉంది. అయితే, డ్యామ్ పోటీ, సరైన చర్చలు లేకుండా నిర్మాణం భవిష్యత్తులో దక్షిణాసియాలో నీటి భద్రత కోసం పెద్ద సంక్షోభాన్ని సృష్టించవచ్చని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: