పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అమెరికా ఆర్థికంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే అమెరికా సుమారు 6 బిలియన్ డాలర్ల మేర యుద్ధ అవసరాల కోసం ఖర్చు చేయడం గమనార్హం. ఇరాన్‌ను నియంత్రించే క్రమంలో అమెరికా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా వెచ్చిస్తూ ఆర్థిక ఒత్తిడికి లోనవుతుంటే, అగ్రరాజ్యానికి ప్రత్యర్థిగా ఉన్న రష్యాకు మాత్రం ఈ పరిస్థితి అయాచిత వరంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడంతో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి, ఇది రష్యా వంటి ఇంధన ఎగుమతి దేశాలకు కలిసొచ్చింది.
Read Also : UNSC Resolution : ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం
రష్యా ఈ సంక్షోభాన్ని తన ఆర్థిక బలోపేతానికి అస్త్రంగా మార్చుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, రష్యాకు రోజుకు అదనంగా 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,300 కోట్లు) ఆదాయం సమకూరుతోంది. ఈ లెక్కన మార్చి నెలాఖరు నాటికి రష్యా ఖజానాలోకి సుమారు 5 బిలియన్ డాలర్ల (రూ.46వేల కోట్లు) అదనపు రెవెన్యూ వచ్చి చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న పుతిన్ ప్రభుత్వానికి, ఈ యుద్ధ మేఘాలు ఆర్థిక ఊపిరిని పోస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, అమెరికా తన జేబుకు చిల్లు పెట్టుకుంటుంటే, రష్యా మాత్రం అదే సమయంలో కాసుల పంట పండించుకుంటోంది.
Read Also :UNSC Resolution : ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం