అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రోస్టేట్ క్యాన్సర్(Cancer )తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని సమాచారం. గత ఏడాది అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న బైడెన్ ఆరోగ్య సంబంధిత కారణాల వల్లే నిర్ణయం తీసుకున్నారని అంచనా వేస్తున్నారు.
బైడెన్ కోలుకోవాలని ప్రజల ఆకాంక్ష
82 ఏళ్ల బైడెన్ ఆరోగ్యవంతంగా కోలుకోవాలని అమెరికా ప్రజలు, ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో “బైడెన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా” అని తెలిపారు. తమ రాజకీయ భిన్నతలు పక్కనబెట్టి, మానవత్వం ప్రదర్శించిన ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాయి.
కమలా హ్యారిస్ ట్వీట్
మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా బైడెన్ గురించి స్పందిస్తూ, “ఆయన ఒక ఫైటర్.. త్వరలోనే కోలుకుంటారు” అని ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైడెన్ అభిమానులు ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని బైడెన్ మళ్లీ ప్రజలమధ్య కనిపిస్తారని ఆశిస్తున్నారు.
Read Also : Chandrababu Naidu :నేడు తెలుగువన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవం