బంగ్లాదేశ్(Bangladesh)లో హిందూ యువకుడు దీపూ చంద్రదాస్ (27) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీపూపై మూక దాడి జరిపి హత్య చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీయడంతో, తాత్కాలిక యూనస్ ప్రభుత్వం స్పందించింది. తమ పాలనలో ఇటువంటి మూకహింసలకు ఏమాత్రం సహనం ఉండదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు స్పష్టం చేశారు.
Read also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

దీపూ హత్య కేసుపై బంగ్లాదేశ్ ప్రభుత్వ హెచ్చరిక
దీపూ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దేశంలో జరుగుతున్న అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ప్రత్యేక కమిషన్ దర్యాప్తు చేపడుతోందని వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
ఈ కేసులో బంగ్లాదేశ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్(Rapid Action Battalion) ఏడుగురిని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో లిమోన్ సర్కార్, తారెక్ హొస్సేన్, మానిక్ మియా, ఇర్షాద్ అలీ, నిజుముద్దీన్, అలోమ్‌గిర్ హొస్సేన్, మీర్జా హొస్సేన్ అకోన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన మైమెన్‌సింగ్ జిల్లా వాలుకా ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: