Bahrain Telugu pilgrims: యుద్ధ వాతావరణం కారణంగా బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన 65 మంది తెలుగు యాత్రికులు ఎట్టకేలకు క్షేమంగా మంగళవారం హైదరాబాద్ రావడానికి మార్గం సుగమం అయింది. కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు తమను ఆదుకున్న ప్రభుత్వ యంత్రాంగానికి, తెలుగు సంఘాలకు తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొనె సల్మాన్ రాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: PM Kisan : ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

నిలిచిపోయిన విమాన సర్వీసులు
మంగళవారం బహ్రెయిన్ నుండి ప్రభాతవార్తతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. గత నెల ఫిబ్రవరి 24న టూరిస్ట్ వీసాపై బహ్రెయిన్ వెళ్లిన తాము 28న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే అనూహ్యం గా యుద్ధం ప్రారంభం కావడంతో విమాన సర్వీసులు నిలిచిపోయి అక్కడే చిక్కుకు పోయామని అన్నారు. భయానక పరిస్థితుల మధ్య 10 రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపామని అన్నారు. తాము స్వదేశానికి రావడానికి కృషి చేసిన సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రక్షణ మంత్రి బహ్రెయిన్ నుండి హైదరాబాద్ కు పయనమైన తెలుగు ప్రజలు రాజ్ నాథ్ సింగ్ తక్షణమే స్పందించి విమానయాన శాఖతో సమన్వయం చేయడం వల్లనే మంగళవారం గల్ఫ్ ఎయిర్ ద్వారా బాధితులు క్షేమంగా హైదరాబాద్ పయనం అవడానికి మార్గం సుగమం అయిందన్నారు. తెలుగు అసోసియేషన్ బహ్రెయిన్ ప్రతినిధులు ప్రభుత్వాలతో నిరంతరం సమన్వయం చేస్తూ ప్రయాణ ఏర్పాట్లు పర్యవేక్షించారన్నారు.
ప్రభుత్వాల సత్వర స్పందన
తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఎ, ఎపిఎన్ఆర్, తెలుగు కళా సమితి ఫిబ్రవరి 28 నుండి అండగా నిలిచిన సభ్యులు రఘునాథ్ బాబు, శివకుమార్, సతీష్ శెట్టి, కె. మోహన్, జగదీష్, ప్రసాద్, కె. సంతోష్, జోయల్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమకు బహ్రెయిన్‌లో తెలుగు ప్రజలు 65 మందికి 10 రోజుల పాటు ఉదయం అల్పాహారం, భోజనం, తాగునీరు అందించిన దాతృత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ సమస్యను నిరంతరం ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తెలుగు జాతీయ దినపత్రిక వార్తకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాలు, ప్రవాస తెలుగు సంఘాలు చూపిన చొరవ వల్లే ఈరోజు తాము సురక్షితంగా ఇళ్లకు చేరుకోగలిగామని బాధితులు భావోద్వేగంతో వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: