భారత అథ్లెట్లు, దక్షిణ కొరియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలతో అదరగొట్టారు. తెలుగు యువ అథ్లెట్ జ్యోతి యర్రాజీ(Jyoti Yarraji), అవినాశ్ సాబ్లెతో పాటు మహిళల 4X400 మీటర్ల రిలే టీమ్‌లో భారత్ స్వర్ణ పతకాలతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ రేసును జ్యోతి 12.96 సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకుంది. ట్రాక్‌పై జ్యోతి అగ్రస్థానంలో నిలిచింది. యుమి తనకా(జపాన్), వు యన్ని(చైనా) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. జ్యోతి విజయానికి రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం(Visakhapatnam)కి చెందిన జ్యోతి గత కొన్నేళ్లుగా తన ప్రతిభను నిలబెట్టుకుంటూ భారత అథ్లెటిక్స్‌లో ఓ కీలక స్థానాన్ని సంపాదించుకుంది.

అభినందనలు
ఇదే వేళ, పురుషుల స్టీపుల్‌చేస్‌లో భారత స్టార్ అథ్లెట్ అవినాశ్ సాబ్లే కూడా మెరిశాడు.అవినాశ్ ముకుంద్ సాబ్లె(Avinash Mukund Sable) 8:20:92సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం దక్కించుకున్నాడు. మహిళల 4X400 మీటర్ల రిలే రేసులో జిస్నా మాథ్యూస్, రూపాల్ చౌదరి, కుంజ రజిత, శుభా వెంకటేశన్(Subha Venkatesan)తో కూడిన భారత జట్టు రేసును 3:34:18 సెకన్లలో పూర్తి చేసి పసిడి కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు 10వ స్వర్ణం కాగా, లీగ్‌లో ఇప్పటి వరకు భారత్ మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో దూసుకెళుతున్నది.
Read Also: Satwik Chirag: బాడ్మింటన్ లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సాత్విక్,చిరాగ్ జోడీ